ఎమ్మార్సీకి చేరుకున్న పాఠ్యపుస్తకాలు

Thu,May 16, 2019 01:36 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, మే 15 : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలు బుధవారం ఎమ్మార్సీ భవనానికి చేరుకున్నాయి. మండలంలోని 29 గ్రామాల్లో 52 పాఠశాలలున్నాయి. 9 జిల్లా పరిషత్‌ పాఠశాలలు, 39 ప్రాథమిక 4 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. జూన్‌ 1 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కాగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయనున్నారు. మండలానికి 26వేల పుస్తకాలు ఇప్పటికే రాగా మరో 20శాతం పుస్తకాలు ఈ వారంలో రానున్నాయి. 1 నుంచి పదో తరగతి వరకు అన్ని సబెక్ట్‌ల పుస్తకాలు చేరుకున్నాయి. ఈ సారి పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా సీరియల్‌ నంబర్లు ముద్రిస్తున్నారు.

విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్న ఈ విధానం వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ పుస్తకాలు అందనున్నాయి. ఎంఈవోలు పాఠశాలల వారీగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసే సందర్భంలో ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలకు కేటాయించిన పుస్తకాల సీరియల్‌ నంబర్లను విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీరియల్‌ నంబర్లకు చెందిన పుస్తకం ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థుల వద్ద కనిపిస్తే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles