‘ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’

Thu,May 16, 2019 01:35 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ : గర్భిణులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మరిపెడ పీహెచ్‌సీ డాక్టర్లు అరుణకుమారి, రవినాయక్‌ అన్నారు. బుధవారం మరిపెడ మండలం తానంచర్ల గ్రామ శివారు జెండాలతండాకు చెందిన బానోత్‌ నగ్మా కాన్పు కాగా ఆమెకు కేసీఆర్‌ కిట్టు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్కారు దవాఖానలో ప్రసవం చేసుకున్న గర్భిణులకు తెలంగాణ ప్రభుత్వం రూ.12వేలు, ఆడపిల్లయైతే రూ.13వేల ఆర్థిక సాయంతో పాటు రూ.3వేల విలువైన కేసీఆర్‌ కిట్టు అందజేస్తున్నారన్నారు. ఈ అవకాశాలను పల్లెల్లోని పేద గర్భిణులు వినియోగించుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల ఆరోగ్య కార్యకర్తలను, ఆశవర్కర్లను కలిసి గర్భిణులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. డాక్టర్ల వెంట దవాఖాన సిబ్బంది ఉన్నారు.
మోడల్‌ స్కూల్‌ ఇంటర్‌ ప్రవేశాలకు

దరఖాస్తుల స్వీకరణ
మరిపెడ, నమస్తేతెలంగాణ, మే 15 : మోడల్‌ స్కూల్‌ ఇంటర్‌ మొదటిసంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 25 వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రేమ్‌కుమార్‌ బుధవారం తెలిపారు. పదోతరగతి పాసైన విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్స్‌ ఉంటాయన్నారు. మెరిట్‌ ప్రకారం.. సీట్లు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. జూన్‌ 1 నుంచి క్లాస్‌లు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles