రెండో విడత పరిషత్ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

Fri,April 26, 2019 01:29 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, ఏప్రిల్ 25: రెండో విడత పరిషత్ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. అదేరోజు నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీపడే అభ్యర్థుల నుంచి ఆర్వోలు నామినేషన్లను స్వీకరిస్తారు. జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం పరిధికి చెందిన మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట, దంతాలపల్లి, కురవి జెడ్పీటీసీ స్థానాలతో పాటు ఆయా మండలాల్లోని మొత్తం 61ఎంపీటీసీలకు మే 10న ఎన్నికలు నిర్వహిస్తారు. 26వ తేదీ నుంచి 28వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, 29న స్కృటినీ, 30న అపీల్, మే 1న డిస్పోజల్ అపీల్‌కు అవకాశం ఇచ్చారు. మే 2న 3గంటల వరకు ఉపసంహరణలు, 3తర్వాత ఫైనల్ జాబితా ప్రకటిస్తారు. మరిపెడ, చిన్నగూడూరు మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీల నామినేషన్ల స్వీకరణ కేంద్రం మరిపెడ మండల్ పరిషత్, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల నామినేషన్ల స్వీకరణ నర్సింహులపేట మండల్ పరిషత్, కురవి జెడ్పీటీసీతో పాటు ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరణ కురవి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలకు 100మీటర్ల దూరం వరకు 144సెక్షన్ అమల్లో ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఓ ప్రతిపాదకుడికి మాత్రం అనుమతి ఉంటుంది.
రెండో విడత ఎన్నికలు జరిగే జెడ్పీటీసీ స్థానాలు 05, ఎంపీటీసీ స్థానాలు 61

దంతాలపల్లిలో..
దంతాలపల్లి: రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా, దంతాలపల్లి మండలంలోని 11 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఉమ్మడి నర్సింహులపేట మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తులను 28 ఆదివారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. వాస్తవానికి ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లు ఆయా మండలాల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించవలసి ఉండేది. కానీ దంతాలపల్లి మండలంలో కార్యాలయం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉమ్మడి నర్సింహులపేట మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లు సమర్పించవలసి ఉంటుంది.

నర్సింహులపేటలో..
నర్సింహులపేట: రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామి నేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుండడంతో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల లెక్కలు పక్కగా చూపేందుకు తప్పని సరిగా బ్యాంకు ఖాతాలు తీయాల్సిందేనని డివిజన్ ఎన్నికల అధికారి ఈశ్వరయ్య తెలిపారు. రెండో విడత నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ 26 నుంచి 28 తేదీ వరకు రెండో విడత నామినేషన్లు దాఖలు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్ధులు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవన్నారు.
సమస్యాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఎన్నికల అధికారులు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, సెల్ టవర్ సిగ్నల్ లేని చోట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను పరిశీలకులుగా నియమించి ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మండలంలోని 10 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఎంపీడీవో కార్యాలయంలో, దంతాలపల్లి మండలంలోని 11 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానానికి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నర్సింహులపేట, దంతాలపల్లి ప్రత్యేకాధికారులు శ్రీనివాసరావు, లక్ష్మణాచారి, తహసీల్దార్ మాధవి, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఈవోపీఆర్డీ గవర్రాజు, జోనల్ అధికారులు నర్సింగ్‌నాయక్, రాజ్‌కుమార్, రింటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles