ముగిసిన నామినేషన్ల పరిశీలన

Fri,April 26, 2019 01:28 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జెడ్పీటీసీ, ఎంపీటీససీ మొదటి విడత ఎన్నికలకు నిమినేషన్ల ప్రక్రియను గురువారం అధికారులు పూర్తిచేశారు. ఈ నెల 20న స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 22న మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 22 నుంచి 24 వరకు నామినేషన్లను స్వీకరించారు. మొదటి విడతలో జిల్లాలో కొత్తగూడ, గంగారం, బయ్యా రం, గార్ల, డోర్నకల్, తొర్రూర్, పెద్దవంగర మండలాల పరిధిలోని 7 జెడ్పీటీసీలతో పాటు, 70 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో నామినేషన్ల చివరి రోజు వరకు జెడ్పీటీసీలకు 96, ఎంపీటీసీలకు 537 నామినేషన్లు వచ్చాయి. ఇందులో ఒక్కో అభ్యర్థి రెండు నుంచి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినవారు ఉన్నారు. గురువారం అధికారులు దాఖలైన నామినేషన్లను పరిశీలించారు. ఇందులో 5ఎంపీటీసీ స్థానాలకు వచ్చిన నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఇవికాక ఒక్కో అభ్యర్ధి రెండు నుంచి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ రిటర్నింగ్ అధికారులు ఒక నామినేషన్ సెట్టుగానే భావించారు. దీంతో జెడ్పీటీసీకి 74 మంది, ఎంపీటీసీకి 442 మంది బరిలో ఉన్నారు.

కాగా ఈ నెల 26న ఆర్డీవోకు అప్పిల్ చేయడం, 27న అప్పిల్ పరిశీలన ఉంటుంది. ఈనెల 28న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. అధికకారులు అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత మే 6న మొదటి విడత ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. నామినేషన్ల పరిశీలన తర్వాత మండలాల వారీగా నామినేషన్ల సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి. బయ్యారం 10, గార్ల 12, కొత్తగుడా 13, గంగారం 8, తొర్రూర్ 12, పెద్దవంగర 9, డోర్నకల్ 10 మొత్తం 74 మంది బరిలో ఉండనున్నారు. అదే విధంగా ఎంపీటీసీల వివరాలు ఇలా ఉన్నాయి. బయ్యారం 88, గార్ల 80, కొత్తగూడ 51, గంగారం 26, తొర్రూర్ 90, పెద్దవంగర 47, డోర్నకల్ 60 మంది ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles