కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి

Fri,April 26, 2019 01:21 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి నమస్తే తెలంగాణ,ఏప్రిల్25 : స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటేలా వ్యూహంతో పని చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యేలకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, డీఎస్ రెడ్యానాయక్, హరిప్రియ, ముఖ్యనాయకులతో సమావేశమై స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పేద ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లాలో ఉన్న 16 జెడ్పీటీసీలను గెలుపొంది జెడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 198 ఎంపీటీసీలను గెలిచి, 16 ఎంపీపీలను కైవసం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలోనూ తొందర పడకుండా జాగ్రత్తలు వహించాలని, పార్టీలో, ప్రజల్లో మంచి పేరు, పలుకుబడి, గెలిచే సమర్థత ఉన్న వారికే టికెట్లు కేటాయించాలన్నారు. ఆశావహుల్లో అసంతృప్తి లేకుండా చూడాలని, పార్టీని నమ్ముకొని, కష్టపడి పని చేసే వారికి తగిన సమయంలో గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని వివరించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. నాయకులు సమన్వయంతో పని చేసేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు భరత్‌కుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మార్నేని వెంకన్న, మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, మర్రి రంగారావు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles