ముగిసిన మొదటి విడత నామినేషన్లు

Thu,April 25, 2019 03:16 AM

- జెడ్పీటీసీ 96, ఎంపీటీసీ 537
- నేడు నామినేషన్ల పరిశీలన
- 28 వరకు ఉప సంహరణ
- మే 6న పోలింగ్..

మహబూబాబాద్ జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటివిడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. గురువారం నామినేషన్లను పరిశీలించనున్నారు. 28 సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లతో పాటు వారికి కేటాయించిన గుర్తులను ప్రకటిస్తారు. మొదటి, రెండో రోజు నామినేషన్లు నామమాత్రంగా దాఖలు కాగా, చివరి రోజు ఏడుమండలాల్లో నామినేషన్ల జాతర కొనసాగింది. అటు జెడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీలకు నామినేషన్లు భారీ సంఖ్యలో దాఖలు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 3విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మే6న మొదటి విడత, మే 10న రెండోవిడత, మూడోవిడత ఎన్నికలు మే14న పోలింగ్ నిర్వహించనున్నారు. మే6న మొదటి విడత ఎన్నికల్లో కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, తొర్రూర్, పెద్దవంగర, డోర్నకల్ మండలాల పరిధిలో 7జెడ్పీటీసీ స్థానాలతో పాటు 70ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

మొదటి విడత ఎన్నికలకు 22నుంచి బుధవారం సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఆర్డీవోకు అప్పీల్ చేయడం, 27న వచ్చిన అప్పీల్స్ పరిశీలన, 28న నామినేషన్ల ఉప సంహరణ, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మే 6న మొదటి విడత పోలింగ్‌ను ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు. 22న మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ జిల్లా ఎన్నికల అధికారి సీహెచ్ శివలింగయ్య విడుదల చేశారు. అదేరోజు ఉదయం 10.30గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. మొదటిరోజు ఒక జెడ్పీటీసీ స్థానంతో పాటు 10ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా రెండో రోజు 23న జెడ్పీటీసీకి ఏడు నామినేషన్లు, ఎంపీటీసీకి 31 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బుధవారం చివరి రోజు నామినేషన్లు భారీ మొత్తంలో నమోదు అయ్యాయి. ఏడు మండలాల పరిధిలో 7 స్థానాలకు జెడ్పీటీసీ, 70 ఎంపీటీసీ స్థానాలకు అత్యధికంగా నామినేషన్లు వచ్చాయి. అధికారులు నామినేషన్ల లెక్క చేయడానికి బుధవారం రాత్రి 10 గంటల వరకు సమయం పట్టింది. గార్ల మండలానికి చెందిన అధికారులు మొదట తప్పుడు సమాచారం ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో తిరిగి గార్ల ఎంపీడీవో సరై న సమాచారం ఇచ్చిన తర్వాత నామినేషన్ల తుది సమాచారం డీపీవో కార్యాలయానికి చేరింది.

నేడు నామినేషన్ల పరిశీలన
ఏడు మండలాల పరిధిలో స్వీకరించిన నామినేషన్ల పరిశీలన గురువారం నిర్వహించనున్నారు. నామినేషన్ల పరిశీలనలో తిరస్కరించబడ్డ అభ్యర్థుల పేర్లను సాయంత్రం 5 గంటల తర్వాత సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో జాబితా ప్రదర్శించనున్నారు. తిరస్కరించిన నామినేషన్లలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 26న ఆర్డీవోకు అప్పీల్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన అప్పీళ్లను ఆర్డీవోలు 27న పరిష్కరిస్తారు. 28న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు వెల్లడిస్తారు. మే 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. మొదటి నామినేషన్లకు గడువు ముగియడంతో అధికారులు రెండోవిడత నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 26 నుంచి రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది.

51
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles