చివరి రోజు భారీగా నామినేషన్లు

Thu,April 25, 2019 03:15 AM

తొర్రూరు రూరల్, ఏప్రిల్ 24 : మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు 91 మంది అభ్యర్థులు 115 సెట్ల నామినేషన్లు, జెడ్పీటీసీ స్థానానికి 12 మంది 17 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని ఎంపీడీవో గుండె బాబు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది. మండలంలోని చింతలపల్లి ఎంపీటీసీ స్థానానికి 5, నాంచారిమడూర్ 4, వెలికట్ట 5, చెర్లపాలెం 15, చీకటాయపాలెం 7, మాటేడు 7, కంఠాయపాలెం 6, వెంకటాపురం 7, ఫత్తేపురం 11, హరిపిరాల 7, మడిపల్లి 8, గుర్తూరు 10, సోమారం 3, అమ్మాపురం 1వ స్థానానికి 8, అమ్మాపురం-2వ స్థానానికి 12 కలిపి మొత్తం 91 మంది అభ్యర్థులు 115 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు తెలిపారు. కాగా జెడ్పీటీసీ స్థానానికి 12 అభ్యర్థులు 17 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.

డోర్నకల్‌లో..
డోర్నకల్: జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు బుధవారం చివరి రోజున నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. మొత్తం 12 ఎంపీటీసీ పదవులకు 67 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్క రోజునే 60 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 30, సీపీఎం నుంచి 7, బీజేపీ నుంచి 6, టీడీపీ నుంచి 3, టీఆర్‌ఎస్ నుంచి 12 దాఖలు కాగా 5గురు స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలుచేశారు. కాగా జెడ్పీటీసీ పదవికి 11 నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం ఉదయం టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీచేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులకు టీఆర్‌ఎస్ పార్టీ యువనాయకుడు ధరంసోత్ రవిచంద్ర బీఫారాలు అందజేశారు. అనంతరం డోర్నకల్ మండలప్రజాపరిషత్ కార్యాలయానికి చేరుకుని జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పోడిశెట్టి కమల నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు గొర్లసత్తిరెడ్డి, నున్నా రమణ, వాంకుడోత్ వీరన్న, కేశబోయిన కోటిలింగం, తదితరులున్నారు. నామినేషన్లకు చివరిరోజు కావటంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా మండలపరిషత్ కార్యాలయానికి వారి మద్దతుదారులతో చేరుకోవటంతో జనసందోహం నెలకొంది.

నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన డీఎస్పీ
డోర్నకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మహబూబాబాద్ డీఎస్పీ ఆంగోతు నరేశ్‌కుమార్ బుధవారం సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రానికి అభ్యర్థితో పాటు పరిమిత సంఖ్యలోనే ప్రతిపాదకులను పంపాలని పోలీసులకు సూచించారు. ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన వెంట డోర్నకల్ సీఐ శ్యాంసుందర్, ఎస్సై అంబటి రవీందర్, ఏఎస్సై సూరయ్య ఉన్నారు.

బయ్యారంలో..
బయ్యారం: తొలి విడతలో త్వరలో మండలంలో జరగనున్న ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల కోసం చివరిరోజు నామినేషన్ల దాఖలు కార్యక్రమం కోలాహలంగా సాగింది. మండలంలో ఒక జెడ్పీటీసీ, 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 22 నుంచి 24 వరకు నామినేషన్ల స్వీకరించారు. తొలిరోజు ఒక్క నామినేషన్ కూడ దాఖలు కాకపోగా రెండోరోజు జెడ్పీటీసీకి 2, ఎంపీటీసీకి 4 నామినేషన్లు వేశారు. అయితే జెడ్పీటీసీకి 11 నామినేషన్లు రాగా టీఆర్‌ఎస్ 2,బీజేపీ 2,కాంగ్రెస్ 3, టీడీపీ 1, ఇండిపెండెంట్ 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలోని 12 ఎంపీటీసీలకు గాను బయ్యారం 8,బయ్యారం2 (జగ్గుతండా) 8,వెంకట్రాంపురం 8, జగత్‌రావుపేట 7,మిర్యాలపెంట 6, కొత్తగూడెం 9,ఉప్పలపాడు 9,గౌరారం 7,రామచంద్రపురం 5,కొత్తపేట 13,కొత్తపేట2-10,ఇస్లాపురం 9 నామినేషన్లు దాఖలయ్యాయి. కేంద్రాన్ని డీఎస్పీ నరేశ్ సందర్శించారు.

గార్లలో..
గార్ల: మొదటి విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు బుధవారం ఆఖరిరోజు నామినేషన్ల పర్వం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 4 కేంద్రాల వద్ద ఎంపీటీసీ అభ్యర్థులు వేచి ఉన్నారు. అయితే 5 గంటల తర్వాత వచ్చే వారిని ప్రధాన ద్వారం వద్దే పోలీసులు సర్దిచెప్పి వెనుకకు వెళ్లగొట్టారు. జెడ్పీటీసీకి 12 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. టీఆర్‌ఎస్ నుంచి 1, కాంగ్రెస్ 4, బీజేపీ1, సీపీఐ (ఎం)1, స్వతంత్య్ర 4, టీడీపీ1 దాఖలు కాగా మొత్తం-12 మంది నామినేషన్లు వేశారు. ఎంపీటీసీ స్థానాలకు వచ్చిన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. గార్ల 1లో 15, గార్ల-2లో 14, పుల్లూరు 5, మద్దివంచ 9, శేరిపురం 9, పోచారం 6, గోపాలపురం 11, ముల్కనూరు 13, పెద్దకిష్టాపురం 14, సీతంపేట 6, పోచారం 6 నామినేషన్లు మొత్తంగా 108 మంది నామినేషన్లను స్వీకరించినట్లు ఎంపీడీవో, అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ జిల్లా అధికారి జీ రవీందర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా స్థానిక ఎస్సై పోల్‌రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్సై డీ నాగేశ్వరరావుతో పాటు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

కొత్తగూడలో..
కొత్తగూడ: మొదటివిడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. కొత్తగూడ జెడ్పీటీసీకి 16మంది, 8 ఎంపీటీసీ స్థానాలకు 54మంది బరిలో ఉన్నట్లు ఎంపీడీవో తెలిపారు. జెడ్పీటీసీకి టీఆర్‌ఎస్ నుంచి 4, బీజేపీ 02, కాంగ్రెస్ 05, టీడీపీ 02, ఇండిపెండెంట్ 02, టీఎస్‌ఈసీ 01 చొప్పున, ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి 04, కాంగ్రెస్ 17, టీఆర్‌ఎస్ 21, టీడీపీ 04, ఇండిపెండెంట్స్ 08, గంగారం జెడ్పీటీసీకి 11 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సీపీఐ(ఎంఎల్ 1, కాంగ్రెస్ 5, టీఆర్‌ఎస్ 02, టీడీపీ 01, ఇండిపెండెంట్స్ 2 ఉన్నాయి. గంగా రం మండలంలోని 3 ఎంపీటీసీలకు గాను 29 నామినేషన్ల దాఖలయ్యాయి. బీజేపీకి 02, కాం గ్రెస్ 08, టీఆర్‌ఎస్ 08, టీడీపీ 04, ఇండిపెండెంట్లు 07 చొప్పున దాఖలు చేసినట్లు ఎంపీడీవో భారతి తెలిపారు. కాగా కొత్తగూడ మండలంలోని బత్తపల్లి ఎంపీటీసీ స్థానానికి 06, వేలుబెల్లి 09, కొత్తగూడ 1 04, కొత్తగూడ 2కు 5, సాధిరెడ్డిపల్లి 3, ఎదుళ్లపల్లికి 10, పొగుళ్లపల్లికి 12, ఓటాయికి 05, గంగారం మండలంలోని మూడు ఎంపీటీసీ స్థానాలకు గాను గంగారం ఎంపీటీసీకి 9, కోమట్లగూడెం 11, మర్రిగూడెం 09 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles