గుండెపూడి బాధిత రైతుల భూముల సర్వే

Thu,April 25, 2019 03:14 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, ఏప్రిల్ 24 : మరిపెడ మండలం గుండెపూడి గ్రామానికి చెందిన బాధిత రైతు ల భూములను బుధవారం సర్వేయర్ సర్వే చేశారు. ఈ నెల 21న నమస్తే తెలంగాణలో పైసలిస్తే.. పట్టా పుస్తకం అంటూ ప్రచురితమైన కథనానికి మరిపెడ తహసీల్దార్ స్పందించి బాధిత రైతుల భూములను సర్వే చేపట్టారు. ఆ గ్రామానికి చెందిన అనబత్తుల శ్రీరాములు, అనబత్తుల సోములు వారి చిన్నానకు చెందిన 3.17ఎకరాల భూమిని 1999వ సంవత్సరం సాధాబైనామా కాగితాలు రాసుకుని కోనుగోలు చేశారు. వీరికి ఇవ్వాల్సిన పట్టా పాస్ పుస్తకాలను రెవెన్యూ అధికారులు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారు. దీనిపై గత కొంత కాలంగా ఆ ఊళ్లో పెద్ద రభ సే సాగింది. అయినా రెవెన్యూ అధికారులకు ఉలుకూ పలుకు కూడా లేదు. నమస్తే తెలంగాణ కథనం తర్వాత కూడా అధికారుల్లో చలనం లేదు.

ఆగ్రహించిన బాధిత రైతులు సోమవారం మరిపెడ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తహసీల్దార్ వెంకటేశ్వర్లకు జరిగిన అన్యాయాన్ని బాధిత రైతులు ఏకరవు పెట్టారు. దీంతో తహసీల్దార్ మంగళవారం మోఖా మీదికి వచ్చి వాస్తవ వాస్తవ పరిస్థితులు పరిశీలించి న్యాయం చేస్తామని భరోసా కలిపించారు. దీంతో రైతులు శాంతించారు. మంగళవారం తహసీల్దార్ మోఖా మీదికి రాలే. బుధవారం సర్వేయర్‌ను భూమి పంపి భూ సర్వే జరిపిస్తున్నారు. దీనిపై ఆ బాధిత రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూమి లెక్కలు తప్పితే సర్వేయర్ అవసరం కాని మా భూమిని పరాయి వ్యక్తికి పట్టా చేశారని మొర పెట్టుకున్న సర్వేయర్‌ను పంపడంలో అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర పరిశీలన చేసి అసలు ఈ భూమి ఎవరిది, ఎన్ని రోజుల నుంచి ఈ భూమిని సాగు చేస్తున్నారు..? ఎవరి దగ్గర భూమి కోనుగోలు చేశారు..? కోనుగోలు చేసిన రైతులకు అప్పుడు పట్టా పాస్ పుస్తకం, 1బీ రికార్డు ఉందా.. ఇవన్ని వదిలి సర్వేయర్‌ను పంపి చేతులు దులుపు కోవాలని చూస్తున్నారని గ్రామస్తులు భగ్గుమంటున్నారు.

101
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles