అధికారుల పనితీరు మార్చుకోవాలి

Wed,April 24, 2019 03:13 AM

-అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు
-రైతులను ఇబ్బందుకు గురి చేస్తే సహించేది లేదు..
-వారం రోజుల్లో భూసమస్యలు పూర్తి..
-తొర్రూర్ ఆర్డీఓ ఈశ్వరయ్య
పెద్దవంగర, ఏప్రిల్23:
రెవెన్యూ అధికారుల పనితీరు మార్చుకోని, ప్రజా సమస్యల పనులపై శ్రద్ధతో పని చేయాలని తొర్రూర్ ఆర్డీఓ ఈశ్వరయ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని తహశీల్థార్ కార్యాలయంలో ఆర్డీఓ మండల రెవెన్యూ అధికారులతో గ్రామాల వారీగా భూసమస్యలపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..పెద్దవంగర మండల భూరికార్డు పట్టాదారు పాసుపుస్తాకాలల్లో జాప్యాంగా ఉండడంతో విఆర్‌ఓలతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లో ఎంతమంది రైతులకు పట్టాదారు పుస్తాకాలు అందాయి, వాటిలో రైతుల భూరికార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని, తహశీల్ కార్యాలయంలో ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, ఎంత మంది రైతులకు పట్టాదారు పుస్తాకాలు రాలేదని వివరాలతో విఆర్‌ఓలను సమీక్షించడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సభలు ఏర్పాటు చేసి గ్రామాల్లోనే రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఏ ఒక్క రైతు నుండి ఉన్నత అధికారుల వరకు సమస్యలు వచ్చిన ఆ అధికారులపై చర్యలు తప్పవని, అధికారులు రైతుల భూపట్టాదారు పుస్తకాల్లో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో రైతు కొనుగోలు చేసిన సాదాబైనామ పత్రాలు, ప్రభుత్వం నిరుపేదలకు అందించిన భూములకు చెందిన నిజమైన ప్రతి రైతుకు పట్టాదారు పుస్తకాలు అందించాలని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేదిలేదన్నారు. ఇప్పటికైన అధికారుల పనితీరులో మార్పులు రావాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని, పెండింగ్‌లో ఉన్న ప్రతి భూసమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ అధికారులు ప్రతి రోజు అయిన నివేదికలను ఆర్డీఓ కార్యాలయంలో తెలియపర్చాలని అధికారులకు సూచించారు.
వారం రోజుల్లోగా సమస్యలు పరిష్కరించాలి..
అన్ని గ్రామాల్లో వారం రోజుల్లో విఆర్‌ఓలు భూసమస్యలు పరిష్కరించి పట్టాదారు పాసుపుస్తకాలకు సిఫారసులు చేయకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటానని ఆర్డీఓ హెచ్చారించారు. ఇప్పటికే గ్రామాల్లోని ప్రజలు విఆర్‌ఓలపై అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడంతో కొందరిపై చర్యలు తీసుకున్నామని, అలాంటి తప్పిదాలకు తావులేకుండా నిజమైన రైతుకు పాసుపుస్తకాలు చేరాలని సూచించారు. విఆర్‌ఓలు పనుల్లో నిర్లక్ష్యం వీడి, గ్రామాల్లోని రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతులు కార్యాలయం చుట్టు తిరుగకుండా పనులు చేయాలని, అలా తిరిగితే అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చారించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ తహశీల్థార్ రవికుమార్, డిప్యూటి తహశీల్థార్ భాస్కరమూర్తి, ఆర్‌ఐ అశోక్, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్‌నాయక్, విఆర్‌ఓలు, రైతులు, తదితరులు ఉన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles