ప్రాధేశిక ఎన్నికల్లో గులాబిజెండా ఎగురవేయాలి

Wed,April 24, 2019 03:13 AM

-ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి
-19 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల అభ్యర్థుల ఎంపికకై సమావేశాలు
కురవి, ఏప్రిల్ 23: కురవి మండలంలో 19 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలలో గులాబి జెండా ఎగురవేయాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. కురవి మండలంలోని గ్రామగ్రామాన మంగళవారం సమావేశాలు నిర్వహించారు. ఆయా గ్రామాలలో ప్రాథేశిక ఎన్నికల్లో పోటీచేసే పార్టీ అభ్యర్థుల పేర్లను సేకరించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఓడీసీంఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ...డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ నాయకత్వంలో 19 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవాలన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషిచేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసమే పాటుపడాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడపగడపకు తీసుకుపోవాలన్నారు. 19 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ సమావేశాలలో మండల అధికార ప్రతినిధి బజ్జూరి పిచ్చిరెడ్డి, ఆలయ చైర్మన్ సోమిశెట్టి శ్రీనివాస్, ముండ్ల రమేష్, కొణతం విజయ్, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles