ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్

Wed,April 24, 2019 03:12 AM

-అభ్యర్ధుల పేర్లు రిజిస్టర్లలో ఏ రోజుకారోజు నమోదుచేయాలి
-ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే..కఠిన చర్యలు తప్పవు
-4 నామినేషన్ కేంద్రాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్
గార్ల, ఏప్రిల్ 23ః స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగంగా ఈ నెల 22 నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం 13.45 గంటలకు జిల్లా కలెక్టర్ శివలింగయ్య అకస్మత్తుగా మండల కేంద్రంలోని పంచాయిత్ రాజ్ శాఖ, విధ్యావనరుల శాఖ, స్త్రీ శక్తి భవన్‌లలో ఏర్పాటు చేసిన 4 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన స్వయంగా తిరిగి పరిశీలించారు. విద్యావనరుల, పంచాయితీ రాజ్, స్త్రీ శక్తి భవన్‌లలోని కేంద్రాలలో తొలి రోజు మండల కేంద్రంతో పాటు పెద్దకిష్టాపురం, పుల్లూరుల నుంచి 3 అభ్యర్ధులు ఎంపీటీసీగా పోటీ చేస్తున్న నామినేషన్ పత్రాలను ఆయ కేంద్రాల్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు రమేష్, కోటేశ్వరరావు, వెంకట్రావ్‌లు రిజిస్టర్లలో అభ్యర్ధుల పేర్లు నమోదు చేయక పోవడాన్ని గుర్తించిన కలెక్టర్ వారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గార్ల-1 కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి వెంకట్రావ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రిజిస్టర్లో అభ్యర్ధుల పేరు ఎందుకు నమోదు చేయలేదని, నామినేషన్ వేసిన అభ్యర్ధి పేరు చెప్పమని నిలదీశారు. ఇలాంటివి పునరావృతం కావొద్దని, విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తు ఉపేక్షించేది లేదని, అస్సలే ఇది ఎన్నికల సమయం అని కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

అంతకు ముందు మండల ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలోకి జిల్లా కలెక్టర్ శివలింగయ్య చేరుకోగానే ఇటీవల విధుల్లో చేరిన 13 మంది పంచాయితీ కార్యదర్శులు మూకుమ్మడిగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ శివలింగయ్య ఎంపీడీవో జీ రవిందర్ ద్వారా వారి గురించి తెలుసుకోని అంకిత భావం, సమయ పాలన పాటిస్తూ.. పని దినాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, దృష్టికి వచ్చిన సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకోని ఎప్పటికప్పుడే పనులు పూర్తి చేయాలని, ప్రజలను తిప్పుకోవద్దని పలు సూచనలు చేశారు. ఈ నెల 24తో (బుధవారం) సాయంత్రం 5 గంటలతో నామినేషన్లు దాఖలు చేయడం పూర్తి అవుతుందని, ఎన్నికలు మే 6న జరగనున్నాయని, సంబందిత అన్ని శాఖల అధికారులు అప్రమ్మత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు దిశ నిర్ధేశం చేశారు. తహాసీల్దారు జీ కృష్ణతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఎంపీడీవోతో కలిసి ఎన్నికల్లో ఒకరికి ఒకరు కో-ఆర్డినెన్స్ చేసుకుంటు సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలిన ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట డీపీఆర్‌వో అయూబ్ అలీ, ఉధ్యాన వన శాఖ జిల్లా అధికారి సూర్యనారాయణ, ఎంపీడీవో, అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ జిల్లా అధికారి జీ రవిందర్, డీఈవో, జడ్పీటీసీ ఎన్నికల విబాగం రిటర్నింగ్ అధికారి సత్యప్రియ, తహాసీల్దారు, ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు జీ కృష్ణ, ఈవోఆర్డి వెంకట్రావ్, పంచాయితీల కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles