48 గంటల్లో బ్యాంకులో డబ్బులు జమ

Tue,April 23, 2019 02:29 AM

నెల్లికుదురు, ఏప్రిల్ 22 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన 48 గంటల్లోనే రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, శ్రీరామగిరి సొసైటీ చైర్మన్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీరామగిరి, ఆలేరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి ఆర్థికంగా మోసపోవద్దని సూచించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తూ రైతు రాజ్యంగా కొనసాగేలా కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. తాగు,సాగు, విద్యుత్ సౌకర్యాన్ని నిరంతరం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతు ఆర్థికంగా బలోపేతమవ్వడానికి మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు సబ్సిడీపై వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు అందిస్తున్నారని అన్నారు. గతంలో ధాన్యం విక్రయించిన తర్వాత వారంరోజులైనా డబ్బులు చెల్లించే పరిస్థితులు ఉండేవి కావన్నారు.

అలాంటిది ప్రస్తుతం సొసైటీ కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే బ్యాంకుల ఖాతాల్లో డబ్బు లు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. రైతులు పండించిన పంటలను విక్రయించినప్పడు రైతు సంతృప్తి చెందే గిట్టుబాటు ధర లేకున్నా వాటిని నిల్వచేసుకోవడానికి అత్యాధునికమైన సాంకేతిక గోదాములను ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. రైతులు తాము పండించిన పంటలను కేవలం సొసైటీల్లో మాత్రమే విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ. 1770, సీ గ్రేడ్‌కు రూ. 1750లు పొందాలని సూచించారు.

గత సీజన్ హమాలీడబ్బులు రూ. 1.25 లక్షలు చెల్లింపు
గత ఖరీఫ్, రబీ సీజన్ల హమాలీ డబ్బులు రూ. 1.25 లక్షలు చెల్లించినట్టు శ్రీరామగిరి సొసై టీ చైర్మన్ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించడానికి క్వింటాకు రూ. 5 చొప్పున రైతు నుంచి తీసుకుంటారు. సంబంధిత రూపాయలను సొసైటీ వారు మంజూరు చేశాక రైతులకు అందివ్వడం అనవాయితీగా వస్తోంది. దీంతో రైతులు హమాలీలకు చెల్లించిన రూపాయలు రావడానికి అలస్యం అవుతున్నది. ఈ నేప థ్యంలో శ్రీరామగిరి సొసైటీ పరిధిలోని మూడు కొనుగోలు కేంద్రాల్లో ఈ ఏడాది నుంచి ముందస్తుగానే హమాలీ డబ్బులను సొసైటీ చెల్లిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సోసైటీ సీఈవో కత్తుల వెంకన్న, సిబ్బంది రంజీత్, ఆలేరు ఉపసర్పంచ్ షరీప్, రైతులు శంకరయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles