నాటక రంగానికి సీఎం కేసీఆర్ ప్రోత్సాహం

Tue,April 23, 2019 02:28 AM

న్యూశాయంపేట, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంతరిస్తున్న నాటక రంగాన్ని, కళాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాదవ్ కళా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక, చలన చిత్రాభివృద్ధి సంస్థ సౌజన్యంతో వనం లక్ష్మీకాంతారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పందిళ్ల శేఖర్ బాబు స్మారక నాటకోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు అని, సాహిత్య, కళారంగాల్లో జాతీయ ఉద్యమంలో తన పాత్రను సమర్ధవంతంగా పోషించారని కొనియాడారు. అంతరించి పోతున్న నాటక రంగాన్ని బతికించి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. పందిళ్ల శేఖర్‌బాబు తన వృత్తిని సమర్ధవంతగా నిర్వహిస్తూనే ప్రవృత్తిపరంగా నాటక రంగానికి సేవ చేశారని చెప్పారు. పౌరాణిక నాటక రంగాన్ని బతికించాలన్న తలంపుతో స్వతహాగా నాటకాలను నేర్చుకొని సమర్ధవంతంగా ప్రదర్శించిన శీలం కల్గిన వ్యక్తి శేఖర్‌బాబు అని పేర్కొన్నారు. కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ శేఖర్‌బాబును స్మరించుకుంటూ ఓరుగల్లులో మూడు రోజుల పాటు నాటకోత్సవాలను నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ఈ ప్రదర్శనలు వరంగల్ జిల్లా ప్రజలకు తీపిగుర్తులుగా మిగిలిపోతాయన్నారు.

నాటకానికి, సినిమాకు చాలా తేడా ఉందని నటనలో తేడా లేనప్పటికీ నాటక ప్రదర్శన గొప్ప విషయమని అన్నారు. వరంగల్ దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవీ. వరప్రసాద్ మాట్లాడుతూ నాటకాలు ఎప్పటికి సజీవంగా ఉంటాయని, ఇలాంటి నాటక ప్రదర్శనలు నిరూపిస్తాయని చెప్పారు. సం స్కృతి , సాంప్రదాయాలను మరచిపోకుండా నాటక పాత్రలు నిజమైన పాత్రలుగా నిలిచిపోతాయన్నారు. నాటక కళాకారులను, నాటకాలను ప్రోత్సహించేందుకు దూ రదర్శన్ ప్రసారం చేస్తుందన్నారు. పందిళ్ల శేఖర్‌బాబు స్మారక నాటక సప్తాహ కమిటీ సభ్యుడు పందిళ్ల అశోక్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాటక రంగాన్ని బతికించడానికి రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ సంచాలకులు ఎంవీ రమణారావు నాటక సప్తాహం నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వరంగల్ నుంచే సప్తాహ కార్యక్రమం ప్రారంభించారన్నారు. గత రెండేళ్ల నుంచి క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం అతిథులను ఘనం గా సన్మానించారు. సభ నిర్వాహన అనంతరం గురుమిత్ర రేపల్లె వారి రైతే రాజు సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటికకు రచన, దర్శకత్వం భూపతి ధర్మారావు వహించారు. అనంతరం తెలంగాణ డ్రమటిక్ అసోసియేషన్ వరంగల్ వారిచే శ్రీకృష్ణరాయబారం పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. రచన కీ.శే.తిరుపతి వెంకటకవులు, దర్శకత్వం తోట సత్యనారాయణ, నిర్వహణ ఆకుల సదానందం వ్యవహరించారు. ఈ రెండు నాటికలు ప్రేక్షకులు అసాంతం ఆస్వాదించారు. కార్యక్రమంలో పురుషోత్తమరావు, నిమ్మల శ్రీనివాస్, దామోదర్, రామశాస్త్రి పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles