మేడారం జాతర తేదీలుఖరారు

Mon,April 22, 2019 01:46 AM

-వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు మహాజాతర
-వేడుకలకు సిద్ధమవుతున్న గిరిజన పూజారులు
తాడ్వాయి, ఏప్రిల్ 21 : ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్కల మహాజాతర తేదీలను ఆదివారం సమ్మక్క-సారక్కల పూజారులు ఖరారు చేశారు. ఈ మేరకు వనదేవతల గద్దెల ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో అమ్మవార్ల పూజారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల మహాజాతర జరుగు తేదీలపై పూజారులు చర్చించుకున్న అనంతరం 2020 ఫిబ్రవరి మాసంలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8 వరకు నాలుగు రోజుల పాటు మహాజాతరను నిర్వహించేందుకు పూజారులు నిర్ణయించారు. 5న సారక్క దేవత, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరుకుంటారు. 6న సమ్మక్క దేవత చిలకలగుట్ట నుంచి గద్దెపై కొలువుదీరుతారు. 7న తల్లులిద్దరూ గద్దెలపై కొలువై ఉన్న వేళ భక్తుల మొక్కులు చెల్లించుకుంటారు. 8న వనదేవతల వనప్రవేశం కార్యక్రమాలు నిర్వహించుటకు పూజారులు నిర్ణయించారు. తల్లులు గద్దెలపైకి చేరుకునే సమయంలో ఇబ్బందులు కలుగకుండా, వీక్షించే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూజారుల సంఘం చర్చించింది.
కార్యక్రమంలో పూజారులు సిద్దబోయిన మునీందర్, మహేశ్, లక్ష్మణ్‌రావు, కొక్కెర క్రిష్ణయ్య, చందా బాబురావు, కాక సారయ్య, కిరణ్‌కుమార్, కనకమ్మ, లక్ష్మీబాయమ్మ, భుజంగరావు, కాక వెంకటేశ్వర్లుతో పాటు పూజారుల కుటుంబాల సభ్యులు గోపాల్‌రావు, బోజరావు, అనిల్, స్వామి, వసంతరావు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles