అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు

Mon,April 22, 2019 01:44 AM

చెన్నారావుపేట, ఏప్రిల్ 21 : కొమ్మాల వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జల్లి గ్రామానికి చెందిన సింగారపు అనిల్(35), ఆయన కూతురు జాస్మిన్(05)ల అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ఆదివారం జరిగాయి. ఎంజీఎంలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం తండ్రి, కూతురు మృతదేహాలను జల్లి గ్రామానికి తీసుకు వచ్చారు.మృతదేహాలు గ్రామానికి చేరుకోగానే వారిని కడసారి చూడడానికి గ్రామస్తులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అటు భర్త, ఇటు కూతురు ఇద్దరు మృతి చెంది మరో కూతురు జాహ్నవి చావు బతుకుల మధ్య హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతుండడంతో మృతుడి భార్య (ఆరు నెలల గర్భిణి) సునీత రోధిస్తున్న తీరు పలువురిని కలిచి వేసింది. అలాగే భర్త, కూతురు మృతదేహాల వద్ద ఆమె విలపిస్తుడడం చూసి గ్రామస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులంతా కంటతడి పెట్టారు. అంతేకాక గొర్రె అరుణ పెద్ద కూతురు సాత్విక (09)కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అటు కన్న కొడుకు, మనుమరాలు, ఇటు బిడ్డ కూతురైన మనుమరాలు ముగ్గురు మృతి చెందడంతో మృతుడు అనీల్, కూతురు అరుణ తల్లిదండ్రులు సింగారపు యాకూబ్, సుశీల దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం సమీపంలోని క్రీస్తునగర్‌లో తండ్రి, కూతురు అంత్యక్రియలను మత గురువులు రెవ స్వామిదాస్, ప్రాస్ట్రేట్ చైర్మన్ రెవ జాన్, రెవ ఇపాల్, ఆకుల స్వామి, సుధాకర్, రాజారత్నం, పింటులు నిర్వహించారు.

48
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles