నేటి నుంచి గంగాభవానీ జాతర

Mon,April 22, 2019 01:43 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, ఏప్రిల్ 21 రెండేళ్లకొకసారి జరిగే తానంచర్ల గంగా భవానీ జాతరను ఆదివారం ఆలయ ధర్మకర్త రామసహాయం కల్పనసత్యనారాయణరెడ్డి, ప్రధాన పూజారి యసారపు లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి భక్తులు వేలాదిగా చేరుకోని గంగమ్మతల్లికి గంప మొక్కులు చెల్లించి, బోనాలు సమర్పిస్తారు. సోమవారం గంగా భవానీ అమ్మవారికి జంతు బలులు ఇచ్చి బంధుమిత్రులను అహ్వానిస్తారు. జాతర ప్రధాన ఘట్టానికి డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత, తుంగతుర్తి ఎమ్మెల్యే గాధారి కిశోర్ హాజరై దైవ దర్శనం చేసుకుంటారని ధర్మకర్తలు తెలిపారు. జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని వారు ధర్మకర్తలు కోరారు. ఆదివారం రాత్రి టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత రామసహాయం రంగారెడ్డి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు రాత్రికి పెద్ద ఎత్తున చేరుకోనున్నారు. కాగా మరిపెడ ఎస్సైలు ఎల్.పవన్‌కుమార్, ప్రసాదరావు బందోబస్త్‌ను పర్యవేక్షించారు.

48
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles