నేటి నుంచి తానంచర్ల గంగాభవానీ జాతర

Sun,April 21, 2019 01:56 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ : తానంచర్ల గంగాభవానీ జాతర ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ శాశ్వత ధర్మకర్త, మానుకోట ఏఎంసీ మాజీ చైర్మన్ రామసహాయం సత్యనారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఆలయ ప్రాంగణంలో ధర్మకర్తలు, పూజారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నేటితో ప్రారంభమయ్యే జాతర మంగళవారంతో ముగుస్తుందన్నారు. సోమవారం రోజు బోనాల సమర్పణ, ఇష్టదేవతకు జంతు బలులు ఇస్తారని తెలిపారు. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే గంగా భవానీ జాతరకు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారన్నారు. సమావేశంలో ప్రధాన పూజారి యసారపు లింగయ్య, రైతు సమితి కో-ఆర్డినేటర్ పీ రాచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు ఆర్ అమరేందర్‌రెడ్డి, దిగిజర్ల ముకేశ్, రావుల సత్యనారాయణరెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు. కాగా తొర్రూరు డీఎస్పీ మదన్‌లాల్ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. శాంతి భద్రతలపై స్థానిక పోలీసులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. డీఎస్పీ వెంట సీఐ ఎం కరుణాకర్, ఎస్సై పవన్‌కుమార్ ఉన్నారు.

94
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles