దేశం మెచ్చిన నాయకుడు కేసీఆర్

Sat,April 20, 2019 01:48 AM

- బయ్యారం ఉక్కు పరిశ్రమ తథ్యం
- టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
- ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎన్నికల పరిశీలకురాలు కవిత
- నలుగురు వార్డు మెంబర్లు , 150 మంది టీఆర్‌ఎస్‌లో చేరిక

బయ్యారం, ఏప్రిల్ 19: జనరంజక పాలన, జనాకర్షక సంక్షేమ పథకాలతో దేశం మెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎంపీ అభ్యర్థి, ఎంపీటీసీ జెడ్పీటీసీ గార్ల, బయ్యారం మండలాల ఎన్నికల పరిశీలకురాలు మాలోత్ కవిత అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొదండరామ స్వామి కల్యాణ మండపంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న జనరంజక పాలనపై ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని, అందువల్లనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించారన్నారు. ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోనుందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. గిరిజన ప్రజల ముఖ్యమైన సమస్య అయిన పోడు భూములు, బయ్యారం పెద్ద చెరువు అభివృద్ధి వంటివి ఎంపీ అయిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరిస్తానని తెలిపారు. కేంద్రం ముందుకు వచ్చిన రాకున్నా రానున్న రోజుల్లో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం తథ్యమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైతం ప్రతీ కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు.

అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు సూచించారు.

టీఆర్‌ఎస్‌లో 150 కుటుంబాలు చేరిక..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నలుగురు వార్డు మెంబర్లతో పాటు 150 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఎంపీ అభ్యర్థి కవిత, ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే కనకయ్య కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారిలో వార్డు మెంబర్లు ఎల్లవుల మల్లయ్య, సూరం లక్ష్మి, విజయ, రజిత, ముఖ్యనాయకులు తిరుమల ప్రభాకర్‌రెడ్డి, సూరం సుధాకర్, కసిరెడ్డి వెంకటరెడ్డి, గాంధీ వెంకన్న, సూరం రవీందర్‌రెడ్డి, నాగేందర్, క్రాంతి తదితరులు ఉన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకుడు హరిసింగ్ నాయక్, మండల అధ్యక్షుడు మూల మధుకర్‌రెడ్డి, సర్పంచ్ కోటమ్మ, ఉప సర్పంచ్ కవిత, ఎంపీపీ గుగులోత్ జయశ్రీ, టీఆర్‌ఎస్ నాయకులు తాత గణేశ్ , గంగుల సత్యనారాయణ, రాసమళ్ళ నాగేశ్వరావు, బానోత్ మురళీకృష్ణ, ఆంగోత్ శ్రీకాంత్, జూలకంటి సీతారాంరెడ్డి, కొండ్రెడ్డి సోమిరెడ్డి, ఎనుగుల ఐలయ్య, గోపాల్ ,పగడాల శ్రీను, రాంముర్తి, వెంటగపతి, సత్తిరెడ్డి పాల్గొన్నారు.

గార్లలో..
గార్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త శక్తి వంచన లేకుండా పని చేయాలని మహాబూబాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మాలోత్ కవిత నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక విశ్వశాంతి విద్యాలయ ప్రాంగణంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ వడ్లమూడి దుర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తలతో ఆమె ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యలతో కలిసి పాల్గొన్నారు. స్థానిక పోరు పై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ మాలోత్ వెంకట్‌లాల్ నాయక్, జడ్పీటీసీ ఎద్దు మాధవి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుండా వెంకట్‌రెడ్డి, కట్టా శ్రీనివాసరావు, పాల్తీయ కిషన్ నాయక్, సామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షులు శీలంశెట్టి ప్రవీణ్ కుమార్, ఇల్లందు ఏఎంసీ మాజీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు, గార్ల మాజీ సర్పంచ్ గంగావత్ లక్ష్మణ్ నాయక్, టీఆర్‌ఎస్‌వీ నాయకులు షేక్ యాకూబ్ పాషా, భూక్య రాంసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

108
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles