అకాల నష్టం..

Sat,April 20, 2019 01:46 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 19: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి సుమారు 40 నిమిషాల పాటు కురిసిన వర్షంతో రోడ్లలన్నీ జలమయమ య్యా యి. వర్షం కురయడానికి వీచిన ఈదురు గాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ అదికారులు ముందుస్తుగానే సరఫరాను నిలిపివేశారు. అండర్‌బ్రిడ్జ్ ప్రాంతంలో నీరు నిలిచిపోవడంతో కురవి రోడ్డు నుంచి ఏరియా ఆస్పత్రికి వెళ్లేదారిలో వచ్చే వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నెహ్రుసెంటర్‌లో చెట్లు కొమ్మలు విరిగిపడడంతో ఇబ్బందులు తల్తెతాయి. మూడు కోట్లసెంటర్, మదర్‌థెరిస్సా సెంటర్, బస్టాండ్‌రోడ్‌లో నీరు చేరింది.

కురవిలో..
కురవి : మండలంలో ఉరుముల మెరుపులతో కురిసిన వానతో వాతావరణం కాస్త చల్లగా మారింది.

కేసముద్రంలో..
కేసముద్రంటౌన్ : మండలంలో కురిసిన వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. పంటలు చేతికి వచ్చే సమయంలో కళ్లాల వద్ద మొక్కజొన్న, ధాన్యం, పసుపు వంటి పంట ఉత్పత్తులు నీటికి తడిసి ముద్దయ్యాయి. గాలి వానకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది.

నేలపాలైన మామిడి
గార్ల : గురువారం సాయంత్రం వీచిన గాలిదుమారానికి మామిడి నేల పాలైందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 700 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. గాలి దుమారానికి 30 శాతం కాయ నేల రాలిందని పినిరెడ్డి గూడేనికి చెందిన ఇందుర్తి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తడిసిన ధాన్యం
తొర్రూరు రూరల్ : ఆకాల వర్షం, గాలి దుమారం తో వరితో పాటు మామిడి తోటలు తీవ్రంగా నష్టపో యాయి. గురువారం రాత్రి వీచిన గాలికి పలు చోట్ల ధాన్యం తడవగా, పంటలు నేలకొరిగాయి.అమ్మాపు రం, గుర్తూరు, చెర్లపాలెం, మడిపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసింది.

46
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles