రైతులు ఆందోళన చెందొద్దు

Sat,April 20, 2019 01:46 AM

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: అకాల వర్షంతో నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం మంత్రి స్వగృహంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానతో నష్టపోయిన పంట నష్టాలపై సమీక్షించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పంట నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వడగళ్ల వర్షంతో నష్టపోయి న ప్రతీ రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులు ఆవేదన చెందొద్దన్నారు. సీఎం కేసీఆర్ రైతాంగానికి అండగా ఉన్నారని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. పంట నష్టపరిహారం వివరాలు అందగానే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతుల్ని అన్నివిధాలా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles