ఇంటర్‌లో బాలికలదే అగ్రస్థానం

Fri,April 19, 2019 03:21 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 18: ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత సంవత్సరం ఫలితాల ను పోల్చుకుంటే మహబూబాబా ద్ జిల్లా రాష్ట్రంలో ఫస్ట్ ఇయర్‌లో 27వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 23వ స్థానంలో నిలిచింది. 2019 సంవత్సర ఫలితాల్లో 10 శాతం ఉత్తీర్ణతను పెంచి రాష్ట్రంలో ఫస్ట్‌ఇయర్‌లో17, సెకండ్‌ఇయర్‌లో 18 వ స్థానంలో నిలిచింది. ఈ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లాలో మొత్తంగా 9885 మంది పరీక్ష రాయగా 4790 మంది ఉత్తీర్ణతయ్యారు. ఉత్తీర్ణత శాతం 48.45గా నమోదైంది. గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం 43.45గా ఉండ గా ప్రస్తుతం 5 శాతం ఎక్కువగా నమోదైంది. ఇందులో బాలికలు 3146 మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు 1644 ఉత్తీర్ణుల య్యారు. అయితే బాలుర కంటే బాలికలు రెండు రెట్లు ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ మొదటి సంవత్సరం 1170 మంది పరీక్షకు హాజరుకాగా 538 ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో 940 మంది పరీక్షకు హాజరవగా 543 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో మొదటి సంవత్సరంలో 46శాతం ఉత్తీర్ణతవగా, రెండో సంవత్సరం 58 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఫలితాల్లో బాలికలదే అగ్రస్థానం
మహబూబాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా బాలుర కంటే బాలికలు రెండు రెట్లు అధికంగా ఉత్తీర్ణత సాధించి జనరల్‌లో మొదటి సంవత్సరం 53 శాతం, రెండో సంవత్సరం 58 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ మొదటి సంవత్సరం 65 శాతం, రెండో సంవత్సరం 58 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు.

గతంలో కంటే 5 శాతం ఎక్కువ
ఇంటర్ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా గత ఫలితాల కంటే 5 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించింది. గతంలో 43.45 శాతం మాత్రమే ఉత్తీర్ణతగా ఉంది. 31 జిల్లాలో 27వ స్థానంలో మహబూబాబాద్ జిల్లా నేటి ఫలితాల్లో 18వ స్థానానికి చేరింది.

పలు కళాశాల విజయబేరి
ఇంటర్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. వికాస్ జూనియర్ కళాశాలలో ఎంపీసీలో బుర్రదుర్గేశ్వర్‌రావు 936 మార్కులు, బైపీసీలో జల్లంపల్లి ఉదయచంద్రిక 886 మార్కులు, సీఈసీలో చింతల ఉషారాణి 888 మార్కులు సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో కొత్త రాహుల్ 365/470, బైపీసీలో బి. రాకేష్ 324/440, సీఈసీలో తోట బిందుశ్రీ 393/500 మార్కులు సాధించారు. ఒకేషనల్ విభాగంలో 1000 మార్కులకు ఎంపీహెడబ్ల్యూ విభాగంలో జర్పుల కళ్యాణి 976, ఎంఎల్‌టీ కొప్పెర ఉమ 935, సీఎస్‌ఈ విభాగంలో ముంజ సంజయ్ 918 మార్కులు సాధించారు.

ఎస్వీ కళాశాలలో...
ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో బి. బిందు 379/470, ఒకేషనల్ విభాగంలో ఎంపీహెడబ్ల్యూ విభాగంలో బానోత్ నాగమణి 912/1000, ఎంఎల్‌టీ విభాగంలో 907 మార్కులు సాధించారు.

మోడల్ విద్యార్థుల ప్రతిభ
డోర్నకల్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మోడల్ స్కూల్ చిలుకోడుకు చెందిన విద్యార్థులు ప్రతిభను కనబర్చారు. మణిచందన ఎంపీ సీ విభాగంలో 972 , ప్రమీళ 966, బైపీసీలో ఎస్. సుదీప్య 945 అంజలి 937, సీఈసీ విభాగంలో బానోత్ సాయికిరణ్ 938, రశీద 874 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 91శాతం, బైపీసీ విభాగంలో 80శాతం, సీఈసీ విభాగంలో 79శాతం ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపల్ భాస్కర్‌రావు తెలిపారు.

49
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles