స్థానిక షెడ్యూల్ ఖరారు..!

Fri,April 19, 2019 03:20 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిషత్ ఎన్నికలపై అధికారులు దాదాపుగా తేదీలను ఖరారు చేశారు. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు షెడ్యూల్ వివరాలు సూత్రపాయంగా బయటకు రావడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే జిల్లాలకు టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జులను నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాలు, మండలాల వారిగా ఇన్‌చార్జిలను మంత్రి దయాకర్‌రావు ఇప్పటికే నియమించారు. మూడు విడతల్లో నిర్వహించే పోలింగ్ షెడ్యూల్ ప్రకటనను ఈ నెల 20న ప్రకటించనున్నారు. గురువారం హైదరాబాద్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో తేదీలు పూర్తిగా ఖరారయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈనెల 20న షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 22న మొదటి విడత నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 6న మొదటి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. అదేవిధంగా రెండో విడత షెడ్యూల్ ఈ నెల 26న విడుదల, మే 10న రెండో విడత పోలింగ్ ఉంటుంది.

మూడో విడత ఈనెల 30న షెడ్యూల్ విడుదల, మే 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఉన్న 16 మండలాల్లో నిర్వహించే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు వచ్చే స్థానిక ఎన్నికల్లో జెడ్పీ పీఠంపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 16 మండలాల్లో మొద టి విడతలో 7 మండలాలు, రెండో విడతలో 5 మండలాలు, మూడో విడతలో 4 నాలుగు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో బయ్యా రం, గార్ల, కొత్తగూడ, గంగారం, తొర్రూరు, పెద్దవంగర, డోర్నకల్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా రెండో విడతలో మరిపెడ, కురవి, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడురు మండలాలో నిర్వహించనున్నారు. మూడో విడతలో మహబూబాబాద్, కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు మండలాల్లో ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 16 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 198 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల కోసం 2170 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. వీరికి ఈనెల 17 జిల్లా కేంద్రంలో శిక్షణ కార్యక్రమం పూర్తి చేశారు. మొత్తం 3820 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.

మే 6న మొదటి విడత పోలింగ్
మొదటి విడతలో బయ్యారం,గార్ల, కొత్తగూడ, గంగారం, తొర్రూర్, పెద్దవంగర, డోర్నకల్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 22న నోటిఫికేషన్ వెలువడనుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీ, నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 6న ఫోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడతలో 7 మండలాల పరిధిలో 7 జెడ్పీటీసీలతో పాటు 70 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. వీటి పరిధిలో 1,90,029 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మొదటి విడతలో 394 పోలింగ్ కేంద్రాలు, 170 లోకేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

మే 10న రెండో విడుత
ఈనెల 26న రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మే10న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో మరిపెడ, కురవి, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడురు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఐదు జెడ్పీటీసీలతో పాటు 61 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటి పరిధిలో 1,53,863 మంది ఓటర్లు ఉన్నారు. 319 పోలింగ్ స్టేష న్లు, 149 లోకేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కూడా పూర్తి చేశారు.

మే 14న మూడో విడత
మూడో విడతలో ఈనెల 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడతలో మహబూబాబాద్, కేసముద్రం, నెల్లికుదురు, గూడురు మండలాల్లో ఎన్నికల నిర్వహించనున్నారు. నాలుగు జెడ్పీటీసీ స్థానాలతో పాటు 67 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. వీటి పరిధిలో 1,75,621 మంది ఓటర్లు ఉన్నారు. వీటి పరిధిలో 372 పోలింగ్ కేంద్రాలు 157 లోకేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికలకు ఓటరు జాబితా తుది ముసాయిదాను విడుదల చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కూడా ఖరా రయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్, పార్టీ గుర్తులపై నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. దీంతో అధికార పార్టీ నుంచి ఎవరు టికెట్ తెచ్చుకుంటే వారి గెలుపు దాదాపుగా ఖాయం కానుంది.

52
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles