ప్రశాంతంగా మోడల్ పరీక్ష

Fri,April 19, 2019 03:20 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 18 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు మోడల్‌స్కూల్స్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రవేశాల కొరకు విద్యార్థులకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించి అందులో ఎంపికైన వారిని పాఠశాలల్లో చేర్చుకుంటారు. జిల్లా పరిధిలో 16 మోడల్ స్కూల్స్ ఉండగా 2019-20వ సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశానికి గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు మొత్తం 2748 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా జిల్లా కేంద్రంలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2284 మంది విద్యార్థులు హాజరవగా, 464 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.

41
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles