ప్రతీ ఒక్కరికి అవకాశం కల్పిస్తా

Thu,April 18, 2019 01:54 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, ఏప్రిల్ 17: కొద్ది రోజుల్లో రానున్న పరిషత్ ఎన్నికల్లో..టికెట్ రాలేదని ఎవ్వరు చిన్నబుచ్చుకొవద్దు..సమయం వచ్చినప్పుడల్లా..ప్రతీ ఒక్కరికి ఎదో ఒక విధంగా అవకాశం కల్పిస్తానని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. బుధవారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని లకా్ష్మరెడ్డి గార్డెన్‌ల్లో డో ర్నకల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృ త స్థాయి సమావేశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ అధ్యక్షతన జరుగగా రెడ్యానాయక్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ముందు ముందు నామినేటేడ్ పదవులు ఉంటాయని, మున్సిపల్ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. వీటితో మరి కొందరికి అవకాశం వస్తుందన్నారు. పీఏసీఎస్ ఎన్నికలు కూడా ఉన్నాయన్నారు. అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికలు ఉం టాయని గుర్తు చేశారు. పల్లెల్లో కార్యకర్తలు ఐక్యతతో ఉండాలని, కొత్త పాత భేదం లేకుండా అందరికీ తన వంతు సహాయం ఉంటదన్నారు. కార్యకర్తలందరూ సమానమేనని చెప్పా రు. స్థానిక పోరులో టికెట్ ఇవ్వలేదని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై కఠిన చర్యలు ఉం టాయని ఘాటుగా హెచ్చరించారు. నీతి నిజాయితీ, ప్రజల్లో పలుకుబడి, పార్టీ కోసం పని చేసినోళ్లు, సీఎం కేసీఆర్‌పై అభిమానం ఉన్నోళ్లకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు ఇస్తామన్నారు. ఎవ్వరూ పైరవీలు చేయొద్దని సూచించారు. ఆరు నూరైనా అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు గెలిచేలా ప్రతీ కార్యకర్త సైనికుడి వలె పని చేయాలన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చురుకుగా పనిచేసి టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేసిన, వేయించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున ఎమ్మెల్యే రెడ్యానాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

కాళేశ్వరం నీళ్లు తెస్తా
డోర్నకల్ నియోజకవర్గంలోని ప్రతీ చెరువు, కుం టను కాళేశ్వరం నీళ్లతో నింపే యోచన చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ కూడా మాటిచ్చినట్లు చెప్పారు. దసరాలోపే అన్ని గ్రామాలకు గోదావరి జలాలు అందుతాయన్నారు. రైతు కష్టాలు తీరే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారిస్తారని వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సత్యవతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్, యువనేత డీఎస్ రవిచంద్ర, ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీపీ తాళ్లపెల్లి రాణిశ్రీనివాస్, నర్సింహులపేట జడ్పీటీసీ ధర్మారపు వేణు, మరిపెడ మండల రైతు సమితి కోఆర్డినేటర్ చాపల యాదగిరిరెడ్డి, మాజీ ఓడీసీఎంస్ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, మండల కో ఆప్షన్ మెంబర్ ఎండీ అయూబ్, మరిపెడ మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, ఆరు మండలాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు, రైతు సమితి కో ఆర్డినేటర్లు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, గ్రామ పార్టీ బాధ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

109
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles