రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

Thu,April 18, 2019 01:53 AM

- ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసుకోవాలి
- వర్షానికి తడవకుండా జాగ్రత్తలు పాటించాలి : కలెక్టర్ శివలింగయ్య
- అధికారులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 17 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం కొనుగోలుపై ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో కలెక్టర్ మాట్లాడారు. 2018-19 యాసంగిలో జిల్లాలో 75 వేల మెట్రిక్ టన్ను ల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించామని, అందుకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 75 ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అం దులో 22 కేంద్రాలు ఐకేపీ, 45 ప్రాథమిక సహకార సంఘాలు, 5 గిరిజన కో-ఆపరేటివ్ సొసైటీ, 3 కేంద్రాలు మెప్మా ఆధ్వర్యంలో పనిచేస్తాయని చెప్పారు. ధాన్యం సేకరణకు కావాల్సిన 18 లక్షల 75 వేల గన్ని బ్యాగ్‌లను అం దుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని, ఆకస్మికంగా వర్షం వచ్చినా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నా రు. తేమ కొలిచే పరికరం, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, ఇతర సామగ్రి ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా నీడ, మంచినీటి సౌకర్యం, టాయిలెట్లు ఉండాలన్నారు. ప్రతీ కొనుగొలు కేంద్రం వద్ద ఎమ్మార్పీ, నియమాలు, సూచలనలతో బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రతి రైతు వద్ద ధాన్యం పరిశీలించి తదుపరి కొనుగోలు చేయాలని, ఖచ్చితమైన తూకం పాటించాలన్నారు. తేమ నాణ్యత 17 శాతం మించకూడదని రైతుల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. రైతులు కొనుగోలు పత్రాలు ఇచ్చి ఆ వివరాలను వెంటనే కొనుగోలు రిజిస్టర్‌లో నమోదు చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్) ద్వారా నమోదు చేయాలని, రైస్‌మిల్‌కు చేరిన వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. సరుకు అమ్మిన 48 గంటల్లోనే డబ్బులు రైతు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఓపీఎంఎస్ ద్వారా కొనుగోలు వివరాలు నమోదు చేస్తే తొందరగా చెల్లింపులు జరుగుతాయన్నారు. టాకింగ్ చేసిన మిల్లుకు కాకుండా ఇతర మిల్లుకు పంపినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద 500 బ్యాగులు పూర్తికాగానే వెంటనే రవాణా చేయాలన్నారు. రవాణా చేసే కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు అవసరం మేరుకు సిద్ధంగా ఉంచాలన్నారు. రైస్ మిల్లర్లు అధిక సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచుకుని ధాన్యాన్ని లారీల నుంచి త్వరగా దిగుమతి చేసుకోవాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ దేవి మాట్లాడుతూ ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కనీసం 50 టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ఆ రోజు మిల్లుకు చేరితే ధాన్యం స్టాక్ చేయించి టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. వర్షం వచ్చినా ధాన్యం తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధాన్యం కోనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రవాణా కాంట్రాక్టర్లలతో సమస్యలను అడిగి వాటిని పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహ, జిల్లా వ్యవసాయ అధికారి చత్రునాయక్, ఆర్డీవోలు కొమురయ్య, ఈశ్వరయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా మేనేజర్ సివిల్ సప్లయి మహేందర్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఇందిర, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles