కాంటాలు వెంట వెంటనే నిర్వహించాలి

Thu,April 18, 2019 01:53 AM

- రైతులు మద్దతు ధరకే ధాన్యం అమ్ముకోవాలి
- రెండు మూడు రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ
- కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
- టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి
- మిల్లర్ల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలి
- ధాన్యం వివరాలు రోజూ ఆన్‌లైన్లో నమోదు చేయాలి
- కలెక్టర్ శివలింగయ్య
- జిల్లాలోనే ప్రప్రథమంగా కొనుగోలు కేంద్రం ప్రారంభం

నెల్లికుదురు, ఏప్రిల్ 17 : రైతులలు ధాన్యాన్ని అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వెంటనే కాంటాలు నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. మండల కేంద్రంలోని మునిగలవీడు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ డేవిడ్, గ్రామ సర్పంచ్ నల్లాని నవీన్‌రావుతో కలిసి బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. గతంలో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కల్టెకర్ మాట్లాడారు. జిల్లాలోనే మునిగలవీడు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రప్రథమంగా ప్రారంభించినట్లు తెలిపారు. ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించి ఆర్థికంగా నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు అమ్మాలని సూచించారు.

మద్దతు ధరకే ధాన్యం అమ్ముకోవాలి
ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు చెల్లిస్తామంటూ దళారులు చెప్పిన మాయ మాటలను నమ్మకుండా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు రైతులు ధాన్యం అమ్మినప్పుడు ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ పత్రాలను కొనుగోలు నిర్వాహకులకు అందించినట్లయితే 2, 3 రోజుల్లో డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు.

మౌలిక వసతులు కల్పించాలి..
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. అకాలంగా వర్షాలు కురిస్తే రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కాంటాలు నిర్వహించిన ధాన్యం బస్తాలు తక్షణమే మిల్లర్లకు పంపించాలని, మిల్లర్లకు తరలించే క్రమంలో ఏర్పడే సమస్యలను తమ దృష్టికి తీసుకరావాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను జాప్యం చేయకుండా రోజువారీగా టాబ్‌లో ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఆర్డీవో సమ్మయ్య, తహసీల్దార్ ఏ పున్నం చందర్, డీఆర్‌డీవో పీ బలరాంరావు, నారాయణరెడ్డి, డీపీఎం శ్రీనివాస్, మార్కెటింగ్ డీపీఎం నళిని, ఏపీఎం వెంకటేశ్వర్లు, మండల సమాఖ్య అధ్యక్షురాలు మునిత, రైతు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ దేశబోయిన శ్రీశైలం, గట్టు ప్రభాకర్, నిర్వాహకులు పాల్గొన్నారు.

92
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles