36కేజీల గంజాయి పట్టివేత

Thu,April 18, 2019 01:53 AM

పెద్దవంగర, ఏప్రిల్17: అక్రమంగా ఈ నెల 9న తొర్రూర్-వలిగొండ ప్రధాన రహదారి మీదుగా తొర్రూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తూ పట్టుబడిన వ్యక్తుల వివరాలను బుధవారం జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడారు. జిల్లాకు చెందిన వాంకుడోత్ బద్రి అలియాస్ బధ్ర మ్మ, మహబూబాబాద్, అనంతారం గ్రామానికి చెందిన గండు రాకేశ్, కొండపల్లి కృష్ణ, కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు విజయ్‌కుమార్ అలియాస్ రంజిత్‌లు సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఒక ముఠాగా ఏర్పడ్డారన్నారు. బయ్యారం పరిసర ప్రాంతాల్లోని ఓ వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి సికింద్రాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో పట్టుబడినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 36కేజీల గంజాయిని పట్టుకున్నట్లు, దాని విలువ దాదాపు రూ.1.80లక్షలు ఉంటుందని తెలిపారు.

తహసీల్దార్ రవికుమార్ పంచనామా నిర్వహించి గంజాయి విలువను అంచనా వేశారు. కాగా వాంకుడోత్ బద్రి 2015లో కేసముద్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమంగా రవా ణా చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లినట్లు, పట్టుబడిన నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, పూర్తి విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, నేరరహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా పోలీసు వ్యవస్థ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు నేరు గా సమాచారం అందించాలన్నారు. జిల్లాలో జరిగిన శాసనసభ, పార్లమెం ట్, పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించామని, అదే స్ఫూర్తితో స్థానికల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. గంజాయి రవాణా చేస్తున్న నిందితులను పట్టుకున్న పెద్దవంగర పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ డీఎస్పీ మదన్‌లాల్, సీఐ చేరాలు, ఎస్సై రాంచరణ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles