రైతులందరికీ పాస్‌పుస్తకాలివ్వాలి

Wed,April 17, 2019 01:13 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 16: అర్హులైన ప్రతి రైతుకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో రెవెన్యూ భూ రికార్డుల నవీనీకరణ, సాధాబైనామా, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పురోగతిపై మండలాల వారీగా తహశీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డుల నవీనీకరణ వేగవంతం చేసి వారం రోజుల్లోగా పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో 1,94,089 మొత్తం ఖాతాలు ఉండగా అందులో 1,26,515 నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ముద్రించి 1,22,529 పాసు పుస్తకాలను సంబంధిత రైతులకు పంపినీ చేయడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సిబ్బంది పర్యటించి రైతుల సమస్యలను పరిష్కరించి వారికి పట్టాదార్ పాసుపుస్తకాలు అందించాలన్నారు. అర్హత గల రైతులకు వెంటనే పాసు పుస్తకాలు అందించాలని పెండింగ్‌లో ఉన్న పాసుపుస్తకాలు డిజిటల్ సంతకాలు, అర్హత గల సాధాబైనామా, అర్హత గల పీఓటి ఖాతాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇంకనూ 4615 డిజిటల్ సంతకాలు చేయక పెండింగ్ ఉండడంపై సంబంధిత తహశీల్దార్‌లపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రతిరోజు భూరికార్డుల నవీనీకరణ ప్రగతి నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పెండింగ్ ఉన్న వాటిని తర్వితంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ డేవిడ్, తొర్రూర్, మహబూబాబాద్ డీఆర్డీఓలు ఈశ్వరయ్య, కొమురయ్య జిల్లాలోని 16 మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles