నిర్లక్ష్యంపై విచారణ

Wed,April 17, 2019 01:13 AM

-బాబోజీగూడెం భూ రికార్డులు తనిఖీ చేసిన తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య
-నమస్తే తెలంగాణ కథనంతో కదిలిన రెవెన్యూ అధికారులు
-త్వరలో కలెక్టర్‌కు నివేదిక సమర్పణ
-ప్రభుత్వ పనితీరును కొనియాడుతున్న ప్రజలు
మరిపెడ, నమస్తేతెలంగాణ, ఏప్రిల్ 16 : ఓ చిన్న నిర్లక్ష్యం ఓ నిరుపేద కుటుంబానికి పెద్ద శాపంగా మారిందని మంగళవారం నమస్తేతెలంగాణమెయిన్‌లో ప్రచరితమైన కథనం అక్రమార్కులకు హడలెత్తించింది. రెవెన్యూ, వ్యవసాయ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. ఈ కథనంపై ఏకంగా కలెక్టర్, జేసీ, తొర్రూరు ఆర్డీవో, జిల్లా వ్యవసాయ అధికారి ప్రత్యేకంగా కలెక్టర్ చాంబర్లో చర్చించుకున్నట్లు సమాచారం. అనంతరం తొర్రూరు ఆర్డీవోను విచారణకు ఆదేశించడంతో ఆయన మంగళవారం మరిపెడ రెవెన్యూ అఫీస్‌కు చేరుకుని భూ రికార్డులను రాత్రి వరకు తనిఖీ చేశా రు. విచారణ అనంతరం కలెక్టర్‌కు పూర్తి నివేదిక అందించనున్నట్లు తెలిసింది. మరిపెడ మండలం బాబోజీగూడెం గ్రామానికి చెందిన ఎనమాల మల్లయ్యకు వంశపార పర్యంగా సర్వే నెంబర్ 379, 380 ద్వారా 34గుంటల భూమి వచ్చింది. దీంతో పాటు 222, 362 సర్వే నెంబర్లల్లో మరో 26 గుంటల భూమి ఉంది. 362 సర్వే నెంబర్‌లోని 16 గుంటలకు అప్పట్లో పట్టా పాస్ పుస్తకం కూడా వచ్చింది. ఆ భూమిని సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.

కాలం కలిసి రాకపోవడంతో భూమిని మక్తాకు ఇచ్చి పదేళ్ల క్రితం భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడిని తీసుకొని పట్నం బాట పట్టి అక్కడే కూలి పనులు చేసుకోంటూ జీవనం సాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో తన భూమిని రికార్డుల్లో పొందు పరచాలని దరఖాస్తు చేసుకున్నాడు. మల్లయ్యకు ఉన్న 1.20 ఎకరాల భూమిలో 222 సర్వే నెంబర్లో కేవలం 3గుంటలకే కొత్త పట్టా పాస్ పుస్తకం, రూ.300రైతు బంధు వర్తించింది. తనకు 1.20ఎకరాలు ఉంటే మూడు గుంటల భూమికి పట్టా రావడాన్ని నిరసిస్తూ పాస్బుక్, రైతుబంధు చెక్ తీసుకోలేదు. 3జనవరి 2019న సదరు రైతు మృతి చెందాడు. బాధిత కుటుంబం రైతు బీమా కోసం ఎదురు చూడగా తీరని నిరాశ మిగిలింది. దీంతో, బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో వేడుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించి నమస్తేతెలంగాణ బృందం బాబోజీగూడెం వెళ్లి వాస్తవాలను సేకరించింది. బాధిత కుటుంబానికి 1.20ఎకరాల భూమి మోఖాపై ఉంది. అందులో బోరు బావి, విద్యుత్ మోటరు కూడా ఉంది. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 380 సర్వే నంబర్లో మల్లయ్య పేర 17 గుంటల భూమి ఖాస్తు ఖానలో ఉంది. పట్టా మరొకరి పేరున ఉంది. ఇది ఎవరు చేసిన తప్పిదమో కానీ, మల్లయ్య కుటుంబానికి మాత్రం తీరని శోకాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వేడుకున్న వీడియోతో పాటు నమస్తే తెలంగాణ కథనం చూసిన ప్రతీ ఒక్కరు బాధ్యులైన అధికారులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

54
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles