వడదెబ్బతో నలుగురి మృతి

Wed,April 17, 2019 01:12 AM

- పాంనూర్‌లో ముగ్గురు మహిళలు
- శివునిపల్లిలో వృద్ధుడు
స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ ఏప్రిల్16 : రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు వేడి తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నలుగురు ఎండతీవ్రత తట్టుకోలేక చనిపోయారు. ఇందులో పాంనూరుకు చెందిన ముగ్గురు మహిళలు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. స్టేషన్‌ఘన్‌ఫూర్ మండలం పాంనూర్ గ్రామానికి చెం దిన మండల కలమ్మ (42) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం మధ్యాహ్నం ఎండతీవ్రత ఎక్కువకావడంతో అస్వస్థతకు గురైన రాత్రి చనిపోయింది. అదే గ్రామానికి చెందిన బత్తిని వెంకటమ్మ (50) మంగళవారం ప్రాణాలు విడిచిందని కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే కందుకూరి రుక్క మ్మ (56) మంగళవారం మధ్యాహ్నం వడదెబ్బకు గురైయింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె పరిస్థితి విషమించి సాయంత్రం చనిపోయింది. కాగా ఒకే గ్రామానికి ముగ్గురు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అలాగే స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేం ద్రంలోని శివునిపల్లికి చెందిన టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తోట సత్యం తండ్రి తోట వీరయ్య (70) వ్యవసాయ బావి వద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. మంచినీరు తాగిన వెటనే కిందపడిన వృద్ధుడిని స్థానిక దవాఖానకు తీసుకెళ్లాలని 108కు ఫోన్ చేశారు. సిబ్బంది వచ్చి అతడిని పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.

44
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles