భార్యను కిరాతకంగా కొట్టి చంపిన భర్త అరెస్టు

Wed,April 17, 2019 01:11 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 16: భార్యపై అనుమానంతో కొట్టిచంపిన కేసులో నిందితుడు లంక రామును అరెస్టు చేసినట్లు ఎస్పీ నంద్యా ల కోటిరెడ్డి వెల్లడించారు. మంగళవారం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడారు. ఏప్రిల్ 3వ తేదీ మహబూబాబాద్ పట్టణ శివారు పత్తిపాకలో లంక సునీతను భర్త రాము అతికిరాతకంగా కొట్టి చంపాడని తెలిపారు. నిందితుడు లంక రాము గతంలో భార్యను అనుమానించడంతో 9 సంవత్సరాల కిందట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ట్లు, తల్లిదండ్రులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసి మళ్లీ పంపించారని తెలిపారు. మళ్లీ అదే విషయంపై నిందితుడు తీవ్రంగా కొట్టి చంపినట్లు తెలిపారు. పోలీసుల భయంతో పారిపోయి 16వ తేదీ పెద్ద మనుషుల సమక్షంలో లొంగిపోయాడని వెల్లడించారు. నిందితుడిపై సెక్షన్ 498 ఎ, 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ గిరిధర్, టౌన్ సీఐ రవికుమార్, ఎస్సైలు అరుణ్‌కుమార్,రమేశ్‌బాబులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles