టైరు పేలి వాహనం బోల్తా

Wed,April 17, 2019 01:11 AM

-20మందికి తీవ్ర గాయాలు
-క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలింపు
-దవాఖాన పరిసరాల్లో హాహాకారాలు
-దైవ దర్శనానికి వెళ్తుండగా ఘటన
-బాధితులంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు
బయ్యారం ఏప్రిల్ 16 : అతివేగంతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఇరవై మందికి గాయాలైన సంఘటన బయ్యారం మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి కొత్తతండాకు చెందిన పలు కుటుంబాల వారు పాఠశాలలకు సెలవులు రావటంతో తిరుపతి దర్శనానికి వెళ్లేందుకు పయనమయ్యారు. మంగళవారం మహబూబాబాద్ నుంచి కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు తొలుత కొత్తగూడెంలో ప్యాసింజర్ ఎక్కి మహబూబాబాద్ చేరుకోవాలని అనుకున్నారు. అయితే కొత్తగూడెం వెళ్లేసరికి ప్యాసింజర్ రైలు వెళ్లిపోవటంతో బొలేరో వాహనంలో మహబూబాబాద్‌కు బయలు దేరారు. ఈ క్రమంలో బయ్యారం మండలంలోని నామాలపాడు వద్దకు రాగానే వాహనం టైర్ పంక్చర్ కావటం, అతి వేగంగా ప్రయాణిస్తుండటంతో వాహనం బోల్తా పడింది. పరిమితికి మించి సుమారు 30 మంది వరకు ప్రయాణిస్తుండగా 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే మానుకోట ఏరియా దవాఖానకు తరలించారు. క్షతగాత్రులకు సిబ్బంది వైద్య సేవలు అందించారు. అధిక సంఖ్యలో క్షతగాత్రులు దవాఖానకు చేరుకోవటంతో ఆవరణం హాహాకారాలతో దద్దరిల్లింది. గాయాలైన వారిలో బన్సీలాల్, భద్రు, కళ, మంగీలాల్, వీరేందర్, శ్రీను, లాలు, ధనలక్ష్మి, స ల్కి, కోటేశ్వరావు, బాలాజీ, కోటయ్య, బిచ్చ, నాగేశ్, దల్‌సింగ్, హరికిషన్, తతవెంకన్న, మరోముగ్గురు ఉన్నారు. బోల్తాపడిన వాహనంలో చిన్నపిల్లలు ఉండటం, వారికి ప్రాణాపాయ స్థితి లేక పోవటంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనపై కేసు నమోదు చేసి విచారణచేస్తున్నట్లు ఎస్సై మురళీధర్ తెలిపారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles