దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు

Wed,April 17, 2019 01:11 AM

-రూ.6.80 లక్షల సొత్తు స్వాధీనం
-వివరాలు వెల్లడించిన ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 16 : తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లికుదురు రామకృష్ణ స్కూల్ క్రాస్ రోడ్డు వద్ద స్థానిక ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామానికి చెందిన కూజాం రాంనర్సయ్య, నెల్లికుదురు మండలం మునిగలవీడుకు చెందిన మాదగాని సురేశ్ అటు వైపుగా వచ్చారు. పోలీసులను చూసి వారు పారిపోతుండగా వారిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా గతంలోనే వీరిద్దరిపై పలు దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. నిందితులపై ఉన్న తొమ్మిది కేసుల్లో 21 తులాల బంగారం, 78 తులాల వెండి స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. వీరిపై 9 కేసులు ఉండడం వల్ల పీడీ యాక్ట్ పెట్టనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసు చేధించిన పోలీసు బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినంది, రివార్డ్సు అందజేశారు. ఈ సమావేశంలో తొర్రూర్ సీఐ చేరాలు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు ఎన్ వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్, నెల్లికుదురు ఎస్సై దేవేందర్, సీసీఎస్ ఏఎస్సైలు ఉప్పలయ్య, వెంకటేశ్వర్లు, పీసీలు వేణుగోపాల్ బాలరాజు, కిషన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles