కవితను భారీ మెజార్టీతో గెలిపించాలి

Mon,March 25, 2019 02:25 AM

మరిపెడ, నమస్తే తెలంగాణ, మార్చి24: మానుకోట టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం మరిపెడబంగ్లాలో డోర్నకల్ నియోజకవర్గ ముఖ్యనేతలతో రెడ్యానాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రచార వ్యూహంపై చర్చించారు. నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఓటర్లను నేరుగా కలిసి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ప్రతీ ఒక్కరు ఈ పక్షం రోజులు కష్టపడి పని చేయాలని కోరారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటానని భరోసా కల్పించారు. సీఎం కేసీఆర్ డోర్నకల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఈ నియోజకవర్గానికి చెందిన గిరిజన ఆడ బిడ్డలిద్దరికి సువర్ణ అవకాశం కల్పించారని ఆ అవకాశాన్ని కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేగా తాను, ఎంపీగా కవిత, ఎమ్మెల్సీగా సత్యవతి ఈ నియోజకర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమించనున్నట్లు చెప్పారు. ఆరునెలల్లో ఇక్కడికి కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తానని, అప్పటి దాక మిశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్, టీఆర్‌ఎస్ యువ నేత డీఎస్ రవిచంద్ర, ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండి వెంకట్‌రెడ్డి, నున్న రమణ, ఇంక ఆరు మండలాల నుంచి ముఖ్య నేతలు పాల్గొన్నారు.

చిన్నగూడూరులో..
చిన్నగూడూరు: టీఆర్‌ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. ఆదివారం చిన్నగూడూరు, మరిపెడ మండలాలకు చెందిన ఆయా గ్రామాల టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉగ్గంపల్లిలో రెడ్యాను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్యా మాట్లాడుతూ.. కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ఆదరణ పొందాయన్నారు. సంక్షేమ ఫలాలు నేడు రాష్ట్రం లోని ప్రతీ ఇంటికీ చేరుతున్నాయని చెప్పారు. రానున్న ఆరు నెలల్లో డోర్నకల్‌కు కాళేశ్వరం జలాలు తెప్పించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు పేర్కొనారు. ఏప్రిల్‌లో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కేసీఆర్ సహకారం, కార్యకర్తల అండదండలతో డోర్నకల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు ఆయూబ్‌పాషా ఆయా గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి.. రెడ్యా సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన డోర్నకల్ కాంగ్రెస్ నాయకులు
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ప థకాలే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. డోర్నకల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డీఎస్ బిత్నానాయక్, ముల్కలపల్లి సర్పంచ్ జే రాంప్రసాద్ తదితరులు 25కుటుంబాలు ఆదివారం మండలంలోని ఉగ్గంపల్లిలో రెడ్యా సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా రెడ్యా వారికి టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎళ్లవేళలా తన వెన్నంటే ఉంటూ తనను ఆదరిస్తున్న నియోజకవర్గంలోని ప్రతీ కార్యకర్త రుణం తీర్చుకుంటానన్నారు. తాను ఎమ్మెల్యేనైనా గిరిజన తండాలోనే ఉంటూ కార్యకర్తల కష్ట సుఖా ల్లో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. ఇచ్చిన మాట కు కట్టుబడి డోర్నకల్‌లోని ప్రతీతండా, మూరుమూల పల్లెలకు సైతం పక్కా రోడ్లు నిర్మించి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపినట్లు గుర్తు చేశా రు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం సుభిక్షంగా మారనుందన్నారు. ప్రజలందరి సంక్షేమం కేసీఆర్‌తోనే సాధ్యమన్నా రు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు డోర్నకల్‌లో జరిగిన అబివృద్ధిని చూసి నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌లో స్వచ్ఛందంగా చేరుతున్నట్లు రెడ్యానాయక్ తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలంతా సమష్టిగా కృషిచేసి మహబూబాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్య ర్థి మాలోతు కవితను భారీ మెజార్టీతో గెల్పించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో పలు గ్రామాల వార్డు సభ్యులు కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గొర్ల సత్తిరెడ్డి, నాయకులు క్రిష్ణ, బాప్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles