భానుడి భగభగలు

Mon,March 25, 2019 02:25 AM

కేసముద్రంటౌన్,మార్చి24: ఈ ఏడాది భానుడి ప్రతాపం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. మార్చి నెలలోనే ఎండలు మండిపోవడంతో రాబోయే రెండు నెలల్లో ఎండల ప్రభావం ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. వారంరోజుల పాటు భానుడి ప్రతాపం కారణంగా పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండగా మహబూబాబాద్‌లో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు 40.08 డిగ్రీలకు చేరుకుంది. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగతోంది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు ఉదయం, సాయం త్రం వేళల్లోనే బయటకు వస్తూ మధ్యాహ్నం సమయంలో ఇంటికే పరిమితమవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో మధ్యా హ్నం సమయంలో బయటకు వెళ్లేవారు టోపీలు, తలకు టవల్స్ కట్టుకుంటూ ప్రత్యమ్నాయ మార్గాలను ఎంచుకుంటూ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కొబ్బరి బోండాలు, వివిధ పండ్లతో తయారు చేసిన శీతల పానియాల కేంద్రాలు నెలకొల్పబడటంతో ఎండ నుంచి ఇబ్బందులు కాకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు.

ఉదయాన్నే పొలాలకు రైతులు..
వర్షాలు సంమృద్ధిగా కురియడం, మిషన్ కాకతీయతో నీటినిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలాలు పైకి రావడంతో రైతులు వానాకాలంతో పాటు యాసంగిలోను వరి, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలను సాగుచేశారు. అయితే పంటలు చేతికి అందివస్తుండటం, కూలీల కొరత కరణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా మార్చి నెల పూర్తి కావస్తున్నా వ్యవసాయ పనులు పూర్తి కాకపోవడం, మరోవైపు ఎండల తీవ్రత పెరుగడంతో రైతులు ఉదయం 6 గంటలకే పంట పొలాలకు వెళ్లి మధ్యాహ్నం వరకు పనులు చేసి ఇంటికి చేరుతున్నారు. సుమారు 3 గంటల పాటు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొని సాయంత్రం మళ్లీ పనులకు వెళ్తున్నారు

24గంటల విద్యుత్‌తో మేలు...
సీమాంధ్ర నాయకుల పాలనలో తెలంగాణలో తరుచు విద్యుత్ కోతలు ఉండటం, వేసవిలో ఎప్పుడు కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ పట్టణాలతో పటుగా పల్లెల్లోను 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండటం రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. దీంతో రైతులు ఎండ తీవ్రత పెరుగకు ముందే ఉదయా న్నే పంటలకు నీరు పారిస్తూ మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంటికే పరిమితమవుతున్న ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వాడుకుంటున్నారు. 24గంటల విద్యుత్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోను విద్యుత్ వినియోగం పెరిగింది.

58
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles