చెయ్యి జారుతోంది..!

Sun,March 24, 2019 01:54 AM

- జిల్లాలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు రోజురోజుకు ఖాళీ అవుతున్నారు. వారంరోజుల నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో వరుస చేరికలతో పార్టీలో కలవరం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోకి వరుస చేరికలతో అయోమయం నెలకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో సహా ఇతర నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మహబూబాబాద్ లోకసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్‌ను ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు భారీగా పెరిగాయి. ఇందులో భాగంగా వారంరోజుల నుంచి సర్పంచ్‌లు, వార్డుసభ్యులు చేరుతున్నారు. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి బలరాంనాయక్ నామినేషన్ వేసిన రోజునే కాంగ్రెస్‌పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుచిత్ర కూడ టీఆర్‌ఎస్‌లో చేరారు. అదేవిధంగా 2018 డిసెంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బలరాంనాయక్‌కు అత్యంత సన్నిహితులుగా ఉండి వ్యవహారాలను చక్కదిద్దిన వారు సైతం శనివారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతుందనే అంతర్మథనం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాంనాయక్ నామినేషన్ వేసిన రోజునుంచే పార్టీలో నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు విపరీతంగా పెరిగాయి. రోజుకు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో ఆపార్టీలో అంతర్మథనం మొదలైంది. నిత్యం వందలాది మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరగడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కొంతమంది నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోగా, నామినేషన్ వేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరి అధ్వానంగా తయారైందని శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసేందుకు కార్యకర్తలు కరువయ్యే పరిస్థితి తయారవుతుందని నాయకులు గుసగుసలాడుకోవడం కొసమెరుపు. నాయకులు, క్యాడర్‌ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగడం లేదని ఆవేదన చెందుతున్నారు.

నామినేషన్ మొదటి రోజు నుంచే..
మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాంనాయక్ నామినేషన్ దాఖలు చేసిన రోజే పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుచిత్ర టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తనను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలిపినప్పటి నుంచి బయ్యారం, గార్ల, మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యింది. కాంగ్రెస్ సర్పంచ్‌లు, మండల అధ్యక్షులు టీఆర్‌ఎస్‌లో చేరారు. బలరాంనాయక్ అత్యంత సన్నిహితుడు కేఎస్‌ఎన్‌రెడ్డి శనివారం టీఆర్‌ఎస్ నాయకుల సమక్షంలో చేరారు. ఈదుల పూసలపల్లికి చెందిన లకా్ష్మరెడ్డి ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. మహబూబాబాద్ మండలంలో జంగిలిగొండ గ్రామం లో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యిం ది. పట్టణంలోని 11వార్డు మాజీ కౌన్సిలర్ కొంగ వెం కటరమణ టీఆర్‌ఎస్‌లో చేరారు. శనివారం కేఎస్‌ఎన్‌రెడ్డితో పాటు మహబూబాబాద్‌కు చెందిన వందలాది మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

రోజు రోజుకూ తగ్గుతున్న పట్టు..
కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా నాయకులు, కార్యకర్తలు వచ్చి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ పట్టు తగ్గుతుండటంతో ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభించే సరికి మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో టీఆర్‌ఎస్‌కు బలం పెరగడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది.

74
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles