దారులన్నీ టీఆర్‌ఎస్ వైపే..

Sun,March 24, 2019 01:53 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, మార్చి 23: మహబూబాబాద్ నియోజకవర్గంలో దారులన్నీ టీఆర్‌ఎస్ వైపే దూసుకుపోతున్నాయని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లు అన్నారు. శనివారం మహబూబాబాద్ మండలం రెడ్యాల, సికింద్రాబాద్ తండా ఈదులపూసపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, కేఎస్‌ఎన్‌రెడ్డి, కోడూరి రంగనాయకమ్మ, రంగారెడ్డిలతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ అభ్యర్థి మాలో త్ కవిత, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌లు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో దారులన్నీ టీఆర్‌ఎస్ వైపే వీస్తున్నాయని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ మంచి అవకాశాలు కల్పించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తామని అన్నారు. ప్రతీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటామని అన్నారు. గతంలో అభివృద్ధి అంటే ఎందో తెలియలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి అంటే దేశంలో ఇలా ఉంటుందని తెలంగాణ వైపు మిగతా రాష్ర్టాలు చూస్తున్నాయని అన్నారు.

రైతు కష్టం తెలిసిన ముఖ్యమంత్రి: ఎమ్మెల్యే శంకర్‌నాయక్
స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అయిందని 43 ఏండ్లు కాంగ్రెస్, 17 ఏండ్లు టీడీపీలో పాలించాయని అప్పుడు ప్రజలకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియలేదని అన్నారు. రైతు కష్టం ఎరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతు రుణమాఫీ, రై తు బీమా తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలు లేకుం డా చేశాడని అన్నారు. 421 పథకాలు చేపట్టి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించారని అన్నా రు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో మాలోత్ కవితను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా: ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత
కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా తీసుకు వచ్చేందుకు అహర్నిషలు కేసీఆర్ నాయకత్వంలో శ్రమిస్తానన్నారు. ఎంపీ నిధులను ఎమ్మెల్యేలతో కలిసి పంచుతానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 16 స్థానాలు గెలుపొందితే కేంద్రంలో కేసీఆర్ చెప్పిన వారే పీఎం అవుతారని అన్నారు. అందరూ సహకరించి కారు గుర్తును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, మార్నేని వెంకన్న, మర్రిరంగారావు, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, డోలి లింగుబాబు, సుదగాని మురళి, తెల్ల శ్రీను, చిట్యాల జనార్ధన్‌రెడ్డి, మార్నేని రఘ, గోనే శ్రీపతి, పెద్ది సైదులు, ఎండి. ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles