కోటంచలో భక్తజన సందడి

Sun,March 24, 2019 01:53 AM

రేగొండ, మార్చి 23 : భక్తుల ఇలవేల్పుగా సేవలు అందుకుంటున్న కోడవటంచ లక్ష్మీనరసింహస్వామి జాతర మూడో రోజైన శనివారం భక్తులతో కిటకిటలాడింది. మండలంలోని కొడవటం చ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరంగల్ ఉమ్మడి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. జాతర సందర్భంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలతో మిరిమిట్లు గొలి పే విధంగా చూడముచ్చటగా అలంకరించారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది పా ల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా హోలీ పౌర్ణమి రోజు నుంచి మూడు రో జులపాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి. మార్చి 21న రాత్రి జాతర ప్రారం భం కాగా, జాతర శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి ని దర్శించుకున్నారు. శనివారం రాత్రి స్వామి వారి నాగబలి(పుష్పయాగం) ఉ న్నందున ఉదయం స్వామి వారికి ప్రత్యే క అభిషేకం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద యం నుంచి మధ్యాహ్నం 12గంటల వ రకు భక్తులకు దర్శనం నిలిపివేయడంతో మధ్యాహ్నం నుంచి భక్తుల రద్దీ పెరిగిం ది. కొడవటంచ నరసింహస్వామి భక్తు లు కోరిన కోర్కెలు నెరవేరుస్తాడనే నమ్మ కం నేటికి భక్తులో ఉంది. జాతరలో ప్ర భ, ఏనుగు, గుర్రం ఆకారం కలిగిన బొ మ్మల బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిశా యి. జిల్లా నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

అలాగే చుట్టు పక్కల గ్రామాలకు చెందినవారు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఆటోల్లో తరలివచ్చి మూడురోజులపాటు స్వామి వా రి జాతర ఉత్సవాలను తిలకించారు. ఆలయ మాజీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్‌రావు, కార్యనిర్వహణ ఆధికారి చిందం శ్రీనివాస్, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది బిల్ల శ్రీనివాస్, ఎక్కలదేవి మహిపాల్, కొంరాజు రవీందర్, గోరంటల శ్రావణ్‌కుమా ర్ నిత్యం అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జాతర ఉత్సవాలు ఆలయ ప్రధాన అర్చకులు తూపురాణి బుచ్చమాచారి ఆధ్వర్యంలో నిర్వహించగా ఆలయ అర్చకులు శ్రీనివాసాచారి, శ్రీనాథాచారి పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles