అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాం

Sat,March 23, 2019 02:16 AM

మహబూబాబాద్, నమస్తేతెలంగాణ, మార్చి 22: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గుగులోత్ సుచిత్ర అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాలోత్ కవిత నామినేషన్ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుచిత్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాసంక్షేమంలో ప్రతీ మనిషికి లబ్ధి చేకూరేలా సీఎం పరిపాలన కొనసాగిస్తున్నారని, టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్‌పై ఉన్న పూర్తి నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఐదు సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని అన్నారు. గిరిజనులకు రాజ్యాధికారం కల్పించేందుకు తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాలోత్ కవితను నియమించి గిరిజనులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవితలు కండువాకప్పి సుచిత్రను సాదరంగా ఆహ్వానించారు. సుచిత్రతో పాటు సుమారు 1000 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, తేళ్ల శ్రీనివాస్, ఎండీ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles