ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

Sat,March 23, 2019 02:16 AM

చిన్నగూడూరు(మరిపెడ), మార్చి22: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేయనున్నట్లు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పీఆర్టీయూ సంఘ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల నోషనల్ ఇంక్రిమెంట్లు ,16రోజుల నగదు రహిత సెలవులు, తెలంగాణ ఇంక్రిమెంట్లు తదితర సాధన పీఆర్టీయూ నిరంతర కృషి ఫలితమేనన్నారు. అనంతరం మండలంలో జరిగిన ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఐక్యత చాటిన సంఘనాయకులను ఈసందర్భంగా అభినందించారు. గెలుపుదిశలో ముందజలో ఉన్నట్లు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షుడు కుడితి ఉపేందర్‌రెడ్డి, సంఘ బాధ్యులు రమేశ్‌రెడ్డి, లింగాల మహేశ్, లింగన్న, ప్రేమ్‌సాగర్, రవి సంఘ మాజీ మండల బాధ్యులు నర్సిరెడ్డి, వెంకన్న తదితరులు ఉన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles