టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కవిత

Fri,March 22, 2019 01:55 AM

-మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
మహబూబాబాద్ జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు మహ బూబాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఏప్రిల్ 11న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికకు అధికార పార్టీ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మహబూబాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ భవిష్యత్‌లో పార్టీ పరంగా ఆయన సేవలు వినియోగించుకునే అవకాశాలున్న నేపథ్యంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కుమార్తె మాలోత్ కవితకు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలపై అన్ని రకాల సర్వేలు, క్షేత్రస్థాయి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు అధినేత నిర్ణ యం తీసుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీకి కవిత టికెట్ ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన నిర్ణయాన్ని గౌరవించి మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల్లో ప్రచారం నిర్వహించి శంకర్‌నాయక్ గెలుపు కోసం కృషి చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు శంకర్‌నాయక్ గెలుపు కోసం కృషి చేశారు. అంతే కాకుండా పూర్వపు వరంగల్ జిల్లాలోని జనగాం, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు ఇన్‌చార్జి బాధ్యతలను కూడా సమర్థవంతంగా పూర్తి చేశారు. 2017లో ఆమెను టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిం చారు. ఆ పదవిలో ఇప్పటికీ కొనసాగు తూ నాయకుల మ న్ననలు పొందారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఆదివాసీలకు కేటాయించగా, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని లం బాడీ మహిళకు కేటాయించారు. ఐదేళ్లుగా నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి పని చేస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన మాలోత్ కవిత మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవ ర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

రాజకీయ ప్రస్థానం
కవిత ఉమ్మడి వరంగల్ జిల్లా మరిపెడ మండలం ఉగ్గంపల్లి లో 1979డిసెంబర్ 31న జన్మించారు. బీఎస్సీ కంప్యూటర్ పూర్తి చేశారు. తన తండ్రి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ స్థానంగా ఉన్న మహ బూబాబాద్ అసెంబ్లీ ఎస్టీలకు రిజర్వు చేశారు. దీంతో అవకాశం కలిసిరావడంతో 2009 కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తిరిగి ఇదే ని యోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ చేతిలో ఓటమి చవిచూసింది. అనంతరం జరిగిన పరిణామాల్లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ పార్టీ కార్యదర్శిగా జనగాం, స్టేష న్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. చిన్న, పెద్దా తేడా లేకుండా అందరినీ కలుపు కొని పోయే మనస్తత్వం నాయకురాలిగా కవిత పేరు సంపాదించారు.

వేడెక్కిన రాజకీయం..
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబాబాద్ పార్లమెంట్‌కు బలరాం నాయక్‌ను ప్రకటించారు. గురువారం టీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోత్ కవితను ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. అయితే టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమైనప్పటికీ మెజార్టీపైనే ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఖరారు కావడంతో ఒకటి రెండు రోజుల్లో ప్రచారం ప్రా రంభించనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారంపై సమీ క్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేలు, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చా ర్జిలు పాల్గొన్నారు. గురువారం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితను ప్రకటించడంతో ప్రచార జోరు పెంచనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించుకున్నారు.

కవిత బయోడేటా
పూర్తి పేరు: మాలోత్ కవిత
విద్యార్హత: బీఎస్సీ కంప్యూటర్స్
పుట్టిన తేదీ: 31-12-1979
భర్త: భద్రునాయక్(ఇండియన్ టెలి కమ్యూని కేష న్స్ చేసి ప్రస్తుతం టీఎస్ షుగర్ అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్‌గా పదవిలో ఉన్నారు.
పిల్లలు: మాలోత్ మహతి, మాలోత్ నయాన్
తల్లిదండ్రులు: డీఎస్.రెడ్యానాయక్ - లక్ష్మి
జన్మస్థలం: ఉగ్గంపల్లి గ్రామం, మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా
2009 తండ్రి మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ రా జకీయ వారసులిగా రంగప్రవేశంతో మహబూబాబాద్ కాంగ్రేస్ టికెట్‌తో పోటి చేసి ఎమ్మెల్యేగా గెలుపోందారు. 2014లో మరోమారు పోటీ చేసి ఓడిపోయాక టీఆర్‌ఎ స్‌లో చేరి ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నా రు. గత అసెంభ్లీ ఎన్నికల్లో డోర్నకల్, మహబూబాబాద్ శాసనసభ్యులు విజయానికి పాటుపడ్డారు. అంతకు ముందు జీహెచ్‌ఎంసీ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేశారు.

80
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles