కమనీయం.. లక్ష్మీనర్సింహుడి కల్యాణం

Fri,March 22, 2019 01:53 AM

దేవరుప్పుల, మార్చి 21: రైతు కుటుంబాల ఇలవేల్పుగా భావించే వానకొండయ్య జాతర గురువారం లక్ష్మీనర్సింహస్వామి కల్యాణంతో ప్రారంభమైంది. కడవెండి శివారులో ఉన్న వానకొండయ్య గుట్టపై వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఏటా కాముని పౌర్ణమి తెల్లవారుజాము నుంచి ఉగాది వరకు జరుగుతాయి. స్వామి వారి కల్యాణం కనులపండువగా జరుగగా.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉష హాజరై శోభాయాత్రలో పాల్గొన్నారు. గుట్టకు రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న కడవెండి నుంచి స్వామి వారి తలంబ్రాలు, పట్టువస్ర్తాలతో వేలాది మంది భక్తులు శోభాయాత్రగా బయల్దేరి లక్ష్మీనర్సింహస్వామికి సమర్పించడం ఆనవాయితీ. ఈసారి మంత్రి సతీమణి ఉష తలంబ్రాలతో శోభాయాత్రలో ఆసాంతం పాల్గొనడం విశేషం. కాగా, ఈ కల్యాణానికి కావాల్సిన పట్టు వస్ర్తాలను అప్పటికప్పుడు పద్మశాలీలు ఈ శోభాయాత్రలో ట్రాక్టర్‌పై అమర్చిన మగ్గంపై నేసి సమర్పించారు. గుట్ట వద్ద అర్చకులు సంపత్కుమాచార్య, శేషభట్టర్ సాయికిరణ్‌శర్మ, రంగాచార్యులు ఉషాదయాకర్‌రావుతోపాటు పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మకు పూర్ణకుంభ స్వాగతం పలికి కల్యాణానికి ఆహ్వానించారు. అర్చకుడు బీట్కూరు సంపత్కుమాచార్య నేతృత్వంలో పదుల సంఖ్యలో జంటలు పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా చేయించాయి.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles