టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు

Fri,March 22, 2019 01:52 AM

గార్ల రూరల్ : మహబూబాబాద్ ఎంపీగా కవితకు టికెట్ ఇవ్వడంతో మండలంలోని సీతంపేట గ్రామంలోని రామాలయం వద్ద టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి నినాదలు చేశారు.అనంతరం సీతంపేట సర్పంచ్ బానోత్ లావణ్య మాట్లాడుతూ.....ఎంపీ టికెట్ కవితకు రావడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కబ్బాకుల శ్రీను, బుడిగ మురళి, గండు భిక్షపతి, బానోత్ శ్రీనివాస్ నాయక్, పర్చూరి సాయిబాబు, మాన్‌సింగ్, భద్రజీ, రమేశ్, మహేశ్ పాల్గొన్నారు.
దంతాలపల్లిలో...
దంతాలపల్లి : మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడంతతో మండలంలోని బొడ్లాడ గ్రామంలో సర్పంచ్ జలగం సుష్మగౌడ్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుష్మ స్వీట్లు పంచారు. అనంతరం డప్పుచప్పుళ్లతో గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ, జై కవితమ్మ అంటూ నినాదాలు చేస్తూ, భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జెనిగల సురేష్, హరీష్, మహేష్, శ్రీను, చిట్టి వెంకట్ రెడ్డి, కారెం శ్రీను, సురేష్, వెంకన్న, ఇట్టమల్ల అశోక్, చిన్న మధు, వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి వెంకన్న, శంకరబోయిన రామ్మూర్తి, పొట్టకర్ల యాకయ్య, నాయకులు, మహిళలు, పాల్గొన్నారు.
బయ్యారంలో...
బయ్యారం: మాలోత్ కవితకు ఎంపీ టికెట్ కేటాయించడంపై బయ్యారం, గంధంపల్లి బస్టాండ్ సెంటర్ లో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కొండ్రెడ్డి సోమిరెడ్డి, సీనియర్ నాయకులు రెంటాల బుచ్చిరెడ్డి, రావూరి రామచంద్రయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఎనుగుల ఐలయ్య, ఎంపీటీసీ మంగీలాల్, సర్పంచ్ వెంకటేశ్వర్లు, నాయకులు ప్రవీణ్, రామ్మూర్తి పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles