మతిస్థిమితం లేని యువకుడిని బంధువులకు అప్పగింత

Fri,March 22, 2019 01:52 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, మార్చి 21: మతిస్థిమితం లేని యువకుడిని మహబూబాబాద్ చైల్డ్‌లైన్ ద్వారా బంధువులకు అప్పగించారు. పట్టణంలోని భవానినగర్‌కు చెందిన భూక్య హరికృష్ణ (18) పుట్టుకతోనే మాటలు రాక మానసిక వ్యాధితో బాధపడుతుండేవాడు. హరికృష్ణ తల్లిదండ్రులు చనిపోవడంతో తన పెద్దమ్మ కుమారుడైన జాటోత్ భాస్కర్ చేరదీశాడు. ఆగస్టు 15, 2018లో ఇంటి నుంచి కనబడకుండా వెళ్లిపోయాడు. ఈ విషయమై భాస్కర్ మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తెలిసిన బంధువుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ముంబాయిలోని బాలసదనంలో ఉన్న సమాచారం వరంగల్ చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ పరుశరాములు తెలుసుకొని మహబూబాబాద్ చైల్డ్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ తప్పెట్ల వెంకటేశ్‌కు సమాచారం అందించి వారి ద్వారా బంధువులకు అప్పగించారు. ఎనిమిది నెలలుగా కనిపించకుండా పోయిన హరికృష్ణ రావడంతో బంధువులు హర్షం వ్యక్తం చేశారు. యువకుడిని అప్పగించిన చైల్డ్‌వెల్‌ఫేర్ సిబ్బందికి, ఐసీపీఎస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles