రేపు టీఆర్‌ఎస్‌లో చేరికలు

Fri,March 22, 2019 01:52 AM

డోర్నకల్, మార్చి 21 : గతంలో ప్రజారాజ్యం, వైఎస్సార్ సీపీ నుంచి డోర్నకల్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన బానోతు సుజాత మంగీలాల్ శనివారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఆమెతో పాటు డోర్నకల్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి ఎన్నికైన ఐదుగురు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీలకు చెందిన వారు డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, పార్లమెంట్ టీఆర్‌ఎస్‌పార్టీ అభ్యర్థిని మాలోతు కవిత సమక్షంలో శనివారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. డోర్నకల్ పట్టణశివారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి జైన్ భవన్‌వరకు భారీ ర్యాలీతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నట్లు సుజాత మంగీలాల్ తెలిపారు. పార్టీలో చేరి ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ పార్టీని బలోపేతం చేయటమే తన వంతు కృషిచేస్తానని ఆమె తెలిపారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles