తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు

Thu,March 21, 2019 01:28 AM

- ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
- రాష్ట్ర అభివృద్ధి చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు, నమస్తే తెలంగాణ, మార్చి 20 : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తు న్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్ కనుమరుగవుతుందని అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే ఆ పార్టీ నాయకులు అనవసరమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా.. మీకో న్యాయం మాకో న్యాయమా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇటీవల ఎమ్మెల్యేలు గా గెలుపొందిన కాంగ్రెస్ నేతలు పార్టీ కన్నా సొంత ఇమేజ్ తోనే గెలిచారని తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే ఢిల్లీ నాయకులు వణికిపోతున్నారని అన్నారు. పార్టీ పిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ నేడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎన్నికలంటే భయం లేదని, టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు అవసరమైతే రాజీనామాకు సిద్ధంగా ఉంటారని చెప్పారు. సొంత నియోజకవర్గమైన పాలకుర్తిని, ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రెండు పార్లమెంట్ సీట్లు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తాం..
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేశంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని, ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని అన్నారు. ఫెడరల్ ఫ్రెంట్ పేరుతో రాష్ర్టాల్లో పర్యటించి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లు గెలిపించి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీ వచ్చేలా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

48
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles