ఉపాధి హామీ కూలీలకు నిధులు పుష్కలం

Thu,March 21, 2019 01:27 AM

- వేసవిలో అదనపు కూలి డబ్బులు
- మౌలిక సౌకర్యాలు అమలు చేయాలి
- దివ్యాంగులకు ఉపాధి హామీ పనులు
- హరితహారంను విజయవంతం చేయాలి
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ఉపాధి హామీ పనుల ఆకస్మిక తనిఖీ

కొడకండ్ల, మార్చి 20 : ఉపాధి హామీ పథకంలో కూలీలకు నిధులు పుష్కలంగా ఉన్నాయని, కూలీలు 100 రోజుల పనులను వినియోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని రామవరంగ్రామంలో ఉపాధి హామీ పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు, వారికి వచ్చే వేతనంపై మంత్రి కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద ఉపాధి పనుల నిధులు ఉన్నాయని, వేసవిలో పని చేసే వారికి అధికారులు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వేసవిలో పని చేసిన వారికి ఫిబ్రవరి నెలలో పని చేసిన దానికి అదనం వేతనం 20 శాతం వస్తుందని, మార్చి నెలలో 25 శాతం, ఏప్రిల్, మేలో 30 శాతం, జూన్ మాసంలో 20 శాతం బోనస్ అందజేస్తుందని చెప్పారు. దివ్యాంగులు పని స్థలం నుంచి ఇంటికి చేరుకునేందుకు రూ.10 ఆటో కిరాయి అందజేయనున్నట్లు చెప్పారు. ఆరోగ్యం విషయంలో కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడ దెబ్బతాకిడి గుర్తుంచుకోవాలని, ఉదయం పని ముగించుకుని ఎండ ముదురక ముందే ఇళ్లలోకి చేరుకోవాలని అన్నారు. చెరువు పూడికతత పనులు జరుగుతున్నాయని, ఆ మట్టిని రైతులు పొలంలో తోలుకోవాలని రైతులకు మంత్రి సూచించారు. చెరువు మట్టితో అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. గ్రామాల్లో ఫాంపౌండ్స్, ఫీడర్ చానల్స్, ఇంకుడు గుంతల పనులు జరుగుతున్నాయని అన్నారు. గ్రామాల్లో శ్మశాన వాటికలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు, వంట షెడ్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయకుండే సర్పంచ్‌లు, జీపీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులపై చర్యలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములై పచ్చని పాలకుర్తిగా తీర్చిదిద్దాలని కోరారు. గ్రామాల్లో 14 రకాల మొక్కలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు స్థలంలో, ప్రతీ ఇంట్లో మొక్కలు నాటాలని మంత్రి సూచించారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles