రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు

Thu,March 21, 2019 01:27 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం ముగిసింది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 22న ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాం గం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. బుధవారం సాయంత్రం 5గంటలతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం ముగిసింది. మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని డోర్నకల్, కురవి, మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, కొత్తగూడ,గంగారం, బయ్యారం, గార్ల మండలాలకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని మహబూబాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో, తొర్రురు రెవెన్యూ డివిజన్‌లోని తొర్రురు,నెల్లికుదురు, నర్సింహులపేట, మరిపెడ మండలాలకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని పంపిణీకి తొర్రూరులోని రెవెన్యూ డివిజన్‌లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 13మండల కేంద్రాల్లో 13పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 1074మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 22న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 13పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక 22న జరుగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారులు-15, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు-15మంది, ఇతర పోలింగ్ సిబ్బంది-15మంది, మైక్రో అబ్జర్వర్లు-15మంది, మొత్తం 60మంది సిబ్బందిని నియమించారు. ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. గురువారం రోజునే ఎన్నికల సిబ్బంది తమ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు..
జిల్లా వ్యాప్తంగా 13మండల కేంద్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేంద్రాల్లో విద్యుత్, టాయిలెట్స్, తదితర వసతులు సమకూర్చారు. 13పోలింగ్ కేంద్రాల పరిధిలో 1074మంది ఓటర్లు తమఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని డోర్నకల్, కురవి, మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, కొత్తగూడ,గంగారం, బయ్యారం, గార్ల మండలాలు, తొర్రురు రెవెన్యూ డివిజన్‌లోని తొర్రురు,నెల్లికుదురు, నర్సింహులపేట, మరిపెడ మండలాల కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 22న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుంది. గురువారం ఉదయం నుంచే పోలింగ్ సామగ్రితో సిబ్బంది వారికి కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లనున్నారు. జిల్లాలో మహబూబాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో 9పోలింగ్ కేంద్రాలకు, తొర్రుర్ ఆర్డీవో కార్యాలయంలో 4పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు ఇతర ఎన్నిక సామగ్రిని సిద్ధంగా ఉంచారు.

ముగిసిన ప్రచారం..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఫిబ్రవరి 25నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 25వరకు నామినేషన్ల తుది గడువు ముగిసింది. 6న నామినేషన్లను పరిశీలించారు. 8న నామినేషన్ల ఉపసంహరణ, ఈనెల 22న ఎమ్మెల్సీ ఎన్నికను ఉద యం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వర కు నిర్వహించనున్నారు. 26న ఓట్ల లెక్కింపుతో పాటు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన అభ్యర్థుల ప్రచారం బుధవారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. ఇప్పటికే ప్రచారం ముగియడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

13 పోలింగ్ కేంద్రాలు
ఈ నెల 22న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా యంత్రాగం ఏర్పాట్లను పూర్తి చేసింది. 13 మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం ఓటర్లు 1074 మంది ఉన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles