పోలీసులు ప్రజల రక్షణకు పనిచేయాలి

Thu,March 21, 2019 01:27 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, మార్చి 20: పోలీస్ వ్యవస్థ ప్రజల రక్షణకు పనిచేయాలని, ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్ సమావేశమందిరంలో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళి అందరూ పాటించేలా చూడాలని అన్నారు. గ్రామస్థాయిలో సమావేశాల్లో ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై సంబంధిత అధికారులు తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల వివరాలను చర్చించారు. గత ఎన్నికల్లో బైండోవర్ చేసిన వారికి ఆరునెలలు పూర్తైన వారి యొక్క ప్రవర్తనను బట్టి మళ్లీ బైండోవర్ చేయాలన్నారు. బెల్ట్‌షాపుల నిర్వహణ, నగదు పంపిణీ, మద్యం పంపిణీలను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనివ్వమని అన్నారు. ఎన్నికల్లో తగాదాలు సృష్టించే వారిపై నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో ఉన్న రౌడీలు, కేడీలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా పెట్టాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై జిల్లా పరిధిలో అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఐ, ఎస్సైలకు సూచించారు. జిల్లాలో పెరిగిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏయే సౌకర్యాలు అవసరం ఉన్నాయో గుర్తించాలన్నారు. నేరాలను నియంత్రించుటకు పూర్తి స్థాయిలో పోలీస్ గస్తీ, పెట్రోలింగ్ బ్లూకోల్ట్స్, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, ప్రజాదివస్ ఫిర్యాదుల విచారణలో వేగవంతం, క్లారిటీ ఆఫ్ ఇన్విస్టిగేషన్ ఉండాలని సూచించారు. ఆస్తి సతంబంధిత నేరాలపై పటిష్ట నిఘా వేసి ఉండాలని, సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతీ దరఖాస్తులను, ఎఫ్‌ఐఆర్‌లను, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సీడీ, చార్జ్‌షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్‌లైన్‌లో ప్రతీరోజు ఎంటర్ చేయాలని ఆదేశించారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటివరకు ఉన్న లాంగ్ పెండింగ్ కేసులపై యుఐ కేసులపై కాంపౌండ్ కేసులపై అడిగి తెలుసుకున్నారు.

అలాగే పార్ట్-2 దర్యాప్తులు వేగంగా చేయాలని ఆదేశించారు. ప్రతీ శనివారం కోర్ట్ కానిస్టేబుల్, స్టేషన్ సిబ్బందితో స్టేషన్ ఎస్‌హెచ్‌వో సమావేశం నిర్వహించాలని, ఆ నెలలో యుఐ కేసులు, ఇతర కోర్టు సంబంధిత సమాచారం, ఏదైనా కేసులో తీర్పు వెలువడి నిందితులను శిక్షపడిన లాంటి కేసులపై సిబ్బందితో చర్చించాలన్నారు. రోజువారీ వెహికిల్ చెకింగ్ నిర్వహించాలని, ట్రాఫిక్ నియమనిబంధనలు అందరూ పాటించేలా చూడాలని తెలిపారు. నేర నియంత్రణ చర్యలకై తరచుగా అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో కార్డన్‌సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలన్నారు. నాన్-బెయిలబుల్ వారెంట్‌ను ఎగ్జిక్యూటివ్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్యపానం, టౌన్ న్యూసెన్స్ లాంటి పలు విషయాలలో కఠినంగా వ్యవహరించాలని, చిన్న విషయాల్లో ఈ పెట్టి కేసులు నమోదు చేస్తే రేపు జరుగబోయే పెద్ద నేరాలను అరికట్టవచ్చని, అందువలన తరచుగా ఈ పెట్టి కేసులు నమోదు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటులో నేను సైతం కమ్యూనిటీ సీసీ కెమెరా వంటి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములుగా చేయాలన్నారు. పట్టణ కాలనీల్లో, గ్రామ కూడళ్లలో వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ప్రధాన కూడలి వంటి చోట్ల ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం అత్యుత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసాపత్రాలు అందించారు. విధి నిర్వహణ బాధ్యయుతంగా క్రమశిక్షణతో నిర్వర్తించే వారికి తగిన గుర్తింపు ఉంటుందని, తోటి సిబ్బందికి ఆదర్శంగా ఉండేలా ప్రజలకు సేవలు అందిస్తూ వారికి మరింత చేరువ అవ్వాలని ఎస్పీ తెలిపారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles