గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రం

Wed,March 20, 2019 01:27 AM

-అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు
-ఈవీఎంలను భద్ర పరిచేందుకు ఏడు స్ట్రాంగ్ రూంలు
-లెక్కింపునకు మరో ఏడు గదుల నిర్మాణం
-ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం
-మే 23న ఎన్నికల ఫలితాలు
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల లెక్కింపును గతంలో వరంగల్‌లోని ఏనమాముల వ్యవసాయ మార్కెలో నిర్వహించే వారు. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు చేయాలనే నిబంధనను తీసుకువచ్చింది. దీంతో జిల్లాకేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక్కడ భద్రతతో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు, పార్కింగ్‌కు అనుకూలమైన స్థలం ఉన్నాయని గుర్తించి నివేదికను ఎన్నికల అధికారులకు పంపించారు. దీంతో ఎన్నికల సంఘం కూడ గురుకుల పాఠశాలను ఎంపిక చేసింది.

ఇందుకు తగ్గట్లుగానే ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్ శివలింగయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ముగియగానే ఈవీఎంలు, వీవీ ప్యాట్లను తీసుకొచ్చి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూముల్లో భద్ర పరుచనున్నారు. అనంతరం మే23న నిర్వహించే కౌంటింగ్‌కు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరు ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీటికి కావాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివలింగయ్య ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలలో కొత్తగోడల నిర్మాణాలను చేపట్టారు. లెక్కింపు కేంద్రాల్లో కావాల్సిన కనీస ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ముఖ్యంగా విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు, తదితర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఓటింగ్ యంత్రాలు సిద్ధం
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకర్గంలోని మొత్తం 1,735 పోలింగ్ కేంద్రాలకు 2,148 బ్యాలెట్ యూనిట్లు, 2,148 కంట్రోల్ యూనిట్లు, 2,749 వీవీప్యాట్లు కేటాయించారు. వీటిని వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు ఒక రోజు ముందు ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తీసుకొని వెళ్లనున్నారు. ఏప్రిల్ 11న ఎన్నికలు పూర్తి అయిన అనంతరం జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలకు ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలకు తీసుకొచ్చి భద్రపరుచనున్నారు.

41 రోజులు బ్యాలెట్ బాక్స్‌లను భద్రపర్చాలి
మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 10న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 25వరకు కొసాగనుంది. 26న నామినేషన్ల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణ ఏఫ్రిల్ 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. అప్పటి నుంచి మే 23వరకు 41రోజులు ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు నిరీక్షించాల్సిన పరిస్థితి. పోలింగ్ పూర్తయిన తర్వాత నుంచి కౌంటింగ్ వరకు 41 రోజుల పాటు ఈవీఎం, వీవీఫ్యాట్లను చాలా జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంది. ఈవీఎంల భద్రత దృష్ట్యా స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలను భద్ర పరిచేందుకు స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ రూములను వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలోని గ్రౌండ్‌ప్లోర్‌తో పాటు మొదటి అంతస్తులో అధికారులు పాఠశాల గదులకు మరమ్మతులు చేస్తున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కింపు
ఏప్రిల్ 11న పోలింగ్ పూర్తి అయిన వెంటనే అదే రోజు రాత్రి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘాక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈవీఎంలను భద్రపరుస్తారు. వీటి కోసం ప్రత్యేకంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కోసం ఏడు స్ట్రాంగ్ రూములు, ఏడు కౌంటింగ్ రూంలను ఏర్పాటు చేశారు. వాటికి మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలింగ్ తేదీకి ముందే ఈ మరమ్మతు పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles